మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు… టాలీవుడ్ సెలబ్రెటీలకు ఈడీ సమన్లు.. విచారణకు రావాలని ఆదేశాలు..

నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12

మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు... టాలీవుడ్  సెలబ్రెటీలకు ఈడీ సమన్లు.. విచారణకు రావాలని ఆదేశాలు..
Drugs Case
Follow us

|

Updated on: Aug 25, 2021 | 6:39 PM

నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రానా దగ్గుపాటి, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్‏లకు ఈడీ సమన్లు పంపించింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ ఆగస్ట్ 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరితోపాటు.. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ మరికొందరికి కూడా నోటీసులు పంపింది.

వీరంతా సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు హాజరు కావాలని తెలిపింది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ చేపట్టలేదు. తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ద్వారా దాదాపు 12 కేసులు నమోదు చేయగా.. 11 ఛార్జ్ షీట్లను ఫిల్ చేశారు. దాదాపు ఎనిమిది మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేవలం కొందరిని విచారించారించి వదిలేసారు. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుపాటి, సెప్టెంబర్ 9న రవితేజ, నవంబర్ 15న ముమైత్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

2017లో సిట్ జూలై నెలలో టాలీవుడ్ ప్రముఖులతో సహా 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోర్ల నమునాను సేకరించింది. అయితే ఇప్పటికీ వీటి గురించి సిట్ ఏలాంటి ప్రకటన చేయలేదు. మాదక ద్రవ్యాలను ముంబై నుంచి హైదరాబాద్‏కు రవాణా చేసి.. ఇక్కడ విక్రయిస్తునిన దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ అలెక్స్ విక్టర్ పై ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. అతడిని 2017లో అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను వెల్లడించాడు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించిన ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి. ఈ కేసులో ఎంక్వైరీ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసును తప్పుగా ఎంక్వైరీ చేశారంటూ తెలంగాణ సీఎస్‌ సోమేశ్ కుమార్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇటీవల పోలీసులకు కొన్నిడ్రగ్స్ కేసులు చిక్కాయి. సెప్టెంబర్‌ 4, 2020 బెంగళూరులో నటీమణులు రాగిణి, సంజనా గల్రానీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 29, 2020 బెంగ‌ళూరులో డ్యాన్సర్ కొరియోగ్రాఫ‌ర్ కిశోర్ అమ‌న్ శెట్టి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అక్టోబర్‌ 15, 2020 బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ మృతి త‌ర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంప‌న‌లు సృష్టించింది. న‌టుడు వివేక్ ఒబేరాయ్ ఇంట్లో బెంగ‌ళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్టోబర్‌ 25, 2020 ముంబైలో నటి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్‌సీబీ చేతికి చిక్కింది. ‘సంవాదన్ ఇండియా’, ‘దేవో కె దేవ్ మహదేవ్’ వంటి సీరియళ్లలో నటించింది. నవంబర్‌13న 2020 నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట హాజరైన నటుడు అర్జున్‌ రాంపాల్‌ జనవరి 6, 2021 కన్నడ నటి శ్వేతాకుమారిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..

Aarya: చీటింగ్ కేసు నుంచి హీరో ఆర్యకు ఉపశమనం.. అసలు దొంగలను పట్టుకున్న పోలీసులు..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు