MAA Elections 2021: మా ఎన్నికల తేదీ ఖరారు.. తేదీ ఎప్పుడంటే..

మా ఎన్నికలు రోజు రోజూకీ వేడెక్కుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఈసారి పోటీ ఎక్కువగానే ఉంది. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యరుల

MAA Elections 2021: మా ఎన్నికల తేదీ ఖరారు..  తేదీ ఎప్పుడంటే..
Maa Elections
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 25, 2021 | 6:33 PM

మా ఎన్నికలు రోజు రోజూకీ వేడెక్కుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఈసారి పోటీ ఎక్కువగానే ఉంది. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యరుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు… పలువురు సినీ పెద్దలు రంగంలోకి దిగి.. మా ప్రతిష్టను దిగజార్చవద్దని చెప్పారు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మా ఎన్నికల ఎప్పుడూ నిర్వహించాలనే విషయంపై ఇప్పటికే పలుమార్లు మీటింగ్స్ జరిగాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్.. సభ్యులు జీవితా రాజశేఖర్, క్రమశిక్షణ సంఘం కృష్ణం రాజు అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించారు.

తాజాగా మా ఎన్నికల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 10న మా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కాసేపట్లో రానున్నట్లుగా సమాచారం. దీంతో ఇక అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇటీవల ఆన్ లైన్ వేదికగా మా సర్వసభ్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మా కార్యవర్గ నిర్వహణ అంశంపై చర్చ జరిపారు. క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అదే చేస్తామని మా అధ్యక్షుడు నరేష్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ముందుగా సెప్టెంబర్ నెలలో మా ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. కానీ.. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తు సన్నద్ధత అవసరమని.. అందుకు కాస్త సమయం కావాలని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. దీంతో సెప్టెంబర్ అక్టోబర్ రెండో వారలో ఎన్నికలు నిర్వహించాలనుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని మా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాసేపట్లో ప్రకటించనున్నారు.

మా ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో వేర్వేరు వర్గాలుగా మారారు నటి, నటులు. ప్రధానంగా ప్రకాష్‌రాజ్‌ తాను పోటీ చేస్తానని చెప్పడంతో మొదలైన ఈ వార్‌…ఇండస్ట్రీలో హీట్ పుట్టించింది. నాన్‌ లోకల్ అంటూ కొందరు వేరు చేస్తున్నప్పటికి…ప్రకాష్‌రాజ్‌ తన వర్గాన్ని తయారు చేసుకొని ప్యానల్‌ కూడా ప్రకటించారు. మొదట మెగా ఫ్యామిలీ మద్దతుతో బరిలో నిలుస్తున్నట్టు టీవీ9 వేదికగా ప్రకటించారు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్. అదే రోజు మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ప్రకటించారు. ప్రకాష్‌రాజ్‌ లాంటి వారు మా అధ్యక్షుడిగా ఉంటే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని చెప్పడం ఆయన వర్గానికి కొంత బలం చేకూరినట్లైంది. ఇదే క్రమంలో హీరో మంచు విష్ణు కూడా నేను సైతం అంటూ బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. మా అసోసియేషన్‌కి సరైన భవనం లేదని…అది తాను అధ్యక్షుడ్ని అయితే కట్టిస్తానంటూ కొత్త విషయంతో ఎన్నికల హీట్‌ని మరింత పెంచాడు. దీనికి ఇండస్ట్రీలోని బిగ్ స్టార్ బాలయ్య కూడా మద్దతివ్వడంతో …పోటీ ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు మధ్య టగ్ ఆఫ్ వార్‌గా మారింది.

ఇద్దరుగా ఉన్న మా అసోసియేషన్ ఎన్నికల పోటీలో…ఆ తర్వాత జీవితా రాజశేఖర్‌ ఎంట్రీతో మూడు ముక్కలాటగా మారింది. జీవితా తీసుకున్న డిసిషన్‌తో నటి హేమ కూడా తాను కూడా పోటీ చేస్తానని…తనకు ఇండస్ట్రీలో చాలా మంది మద్దతు ఉందని ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ గత అసోసియేషన్‌లో జరిగిన అవకతవకల్ని ప్రశ్నించారు. మొత్తం మా అసోసియేషన్ ఎన్నికల్లో నలుగురు పోటీ చేస్తున్నట్లు ఫిక్స్ అయిన టైమ్‌లో తెలంగాణ నినాదంతో ముందుకొచ్చారు నటుడు జీవీఎల్‌ నరసింహరావు. తన ప్యానల్ తెలంగాణ నినాదమే అంటూ కొత్త పంథాలో ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు.

Also Read: అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..

Aarya: చీటింగ్ కేసు నుంచి హీరో ఆర్యకు ఉపశమనం.. అసలు దొంగలను పట్టుకున్న పోలీసులు..