AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..

ఒక సినిమా మొదలు పెట్టినా తర్వాత ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటన్నింటిని తట్టుకుని సినిమాను పూర్తిచేయడం పెద్ద సాహసమే అవుతుంది.

అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..
Sridevi Soda Center
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2021 | 4:12 PM

Share

ఒక సినిమా మొదలు పెట్టినా తర్వాత ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటన్నింటిని తట్టుకుని సినిమాను పూర్తిచేయడం పెద్ద సాహసమే అవుతుంది. ఇక ఆ తర్వాత ఆ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చి.. విజయాన్ని అందించడం మరో ఎత్తు. సినిమా ప్రారంభం తర్వాత ఎలాంటి అడ్డంకులు ఎదురైనా.. వాటన్నింటిని పక్కకు పెట్టి చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. షూటింగ్ సమయంలో సినీ కార్మికులు గాయపడకుండా.. నిర్విరామంగా షూటింగ్ జరపడంలో దర్శకనిర్మాతలకు పెద్ద సవాలుగా ఉంటుంది. అయితే.. తాము మొదలు పెట్టిన సినిమాకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఏర్పడ్డాయని.. కానీ వాటిని ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు శ్రీదేవి సోడా కంపెనీ నిర్మాతలు.

సినిమా సినిమాకు తాము గ్యాప్ తీసుకోవడం లేదని.. మంచి కథ కుదిరితేనే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమాలు చేయడానిక సిద్ధంగా ఉన్నామని తెలిపారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి. టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన లెటేస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహించగా.. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసిన రోజే మెయిన్ కెమెరా పడిపోయింది. కానీ ఆరోజు కెమెరాకు ఏం కాలేదు. ఆ తర్వాతి రోజు క్యారవ్యాన్ అసిస్టెంట్ షాక్ కొట్టి గాయపడ్డాడు. ఆ తదుపరి రోజు క్యారవ్యాన్ ఓ గోతిలో ఇరుక్కుపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నా సొదరుడు (విజయ్ చిల్లా సోదరుడు)ను కోల్పోయాను. దీంతో దాదాపు నెల రోజులు బ్రేక్ తీసుకుని షూట్ స్టార్ట్ చేశాం. ఈ రూరల్ లవ్ స్టోరీలో సుధీర్ బాబు, ఆనంది బాగా చేశారు. గ్రామీణ రాజకీయాలు, కులాల ప్రస్తావన వంటి అంశాలను ఎలా డీల్ చేశమన్నది వెండితెరపై చూడాలి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే మా సినిమాపై బజ స్టార్ట్ అయ్యింది. అలాగే గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత సినిమా బిజినెస్ మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్లలో ఓవర్ సీస్‏లో 120 థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు.

Also Read: Aarya: చీటింగ్ కేసు నుంచి హీరో ఆర్యకు ఉపశమనం.. అసలు దొంగలను పట్టుకున్న పోలీసులు..

101 Jillala Andagadu Trailer: నవ్వులు పూయిస్తున్న 101 జిల్లాల అందగాడు ట్రైలర్.. అవసరాల కష్టాలు మాములుగా లేవుగా..