101 Jillala Andagadu Trailer: నవ్వులు పూయిస్తున్న 101 జిల్లాల అందగాడు ట్రైలర్.. అవసరాల కష్టాలు మాములుగా లేవుగా..

అష్టాచెమ్మా సినిమాతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు అవసరాల శ్రీనివాస్. ఈ మూవీ తర్వాత టాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ

101 Jillala Andagadu Trailer: నవ్వులు పూయిస్తున్న 101 జిల్లాల అందగాడు ట్రైలర్.. అవసరాల కష్టాలు మాములుగా లేవుగా..
101 Jillala Andagadu
Follow us

|

Updated on: Aug 25, 2021 | 2:34 PM

అష్టాచెమ్మా సినిమాతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు అవసరాల శ్రీనివాస్. ఈ మూవీ తర్వాత టాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ నటుడిగా గుర్తింపు పొందాడు. అటు సినిమాల్లో నటిస్తూనే మరొవైపు దర్శకుడిగా, రచయితగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా నూటొక్క జిల్లాల అందగాడు. ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. చి.ల.సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్‏‏గా నటిస్తోంది. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్లపై శిరీష్, వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ప్రారంభం నుంచే ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. గతంలో అవసరాల స్రీనివాస్‏కు బట్టతల ఉందంటూ ఓ చిన్న వీడియో క్లిప్ రివీల్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‏లోనూ అవసరాల శ్రీనివాస్‏ను బట్టతలతో చూపిస్తూ మరింత ఆసక్తిని పెంచుతూ వచ్చారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‏ను వరుణ్ తేజ్ చేతుల సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ట్రైలర్‏లో గుత్తి సూర్య నారాయణ అనే బట్టతల ఉన్న యువకుడిగా కనిపించాడు అవసరాల శ్రీనివాస్. తన బట్టతలను కవర్ చేస్తూ.. విగ్ ధరిస్తూ.. శ్రీనివాస్ పడే పాట్లను ఇందులో చూపించారు. అలాగే తను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గర కూడా తన బట్టతలను దాచుకోవడానికి అవసరాల శ్రీనివాస్ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. విగ్ సాయంతో తన బట్టతలను దాచుకున్నప్పటికీ… తను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గర ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. చివరికి ఏం జరిగిందనేదే నూటొక్క జిల్లాల అందగాడు సినిమా. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆద్యంతం నవ్వులు పూయించే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ మూవీని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. ఆద్యంతం నవ్వులు పంచే ఈ మూవీ ట్రైలర్‏‏‏ను మీరు చూసేయ్యండి.

ట్రైలర్.

Also Read: Manchu Vishnu: మోహన్ బాబు వస్తున్నారని తెలిసి.. రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుంచి పారిపోయిన విష్ణు.. లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు

Salman khan: సల్మాన్‌ ఖాన్‌ని అడ్డుకోవడంలో తప్పులేదు..! అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వహించాడు..

Latest Articles
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి