Manchu Vishnu: మోహన్ బాబు వస్తున్నారని తెలిసి.. రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుంచి పారిపోయిన విష్ణు.. లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు
హీరో మంచు విష్ణు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తన ప్రేమ కథలో ఉన్న ట్విస్టుల గురించి వివరించారు.
Updated on: Aug 25, 2021 | 1:24 PM

తాను వెరోనికా ఏడాది పాటు ఎవరికీ తెలియకుండా లవ్‌లో ఉన్నామని విష్ణు చెప్పారు. అయితే అమ్మకు దీని గురించి తెలిసినా.. నాన్న మోహన్‌బాబుకు మాత్రం చాలారోజులు తెలియకుండా దాచిపెట్టినట్లు వివరించాడు.

తాజ్‌కృష్ణలో వెరోనికా తాను ప్రతిరోజూ లంచ్‌కు కలిసేవాళ్లమని చెప్పిన విష్ణు.. ఒకానొక సందర్భంలో జరిగిన క్రేజీ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నారు. తాము రెస్టారెంట్‌లో ఉండగా అనుకోకుండా మోహన్‌బాబు అక్కడకు వచ్చారని.. మేనేజర్ సహాయంతో కిచెన్ వెనక ఉన్న డోర్ నుంచి బయటకు ఎస్కేప్ అయ్యామని విష్ణు తెలిపాడు.

మీడియాలో న్యూస్ రావడం వల్లనే తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత దాసరి పద్మ గారు రంగంలోకి దిగి, తన తండ్రికి నచ్చజెప్పడంతో తమ పెళ్లి జరిగిందని విష్ణు తెలిపాడు.

కాగా విష్ణు ఇప్పుడు తన వైఫ్ వెరోనికా, పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. భార్య పట్ల, పిల్లల పట్ల ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంటారు విష్ణు.

విష్ణు భార్య వెరోనికా.. జగన్ కి దగ్గరి బంధువు. వరసకు ఆమె సీఎంకు సోదరి అవుతారు.





























