Boyapati Srinu : అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ యాక్షన్ హీరోతోనేనా..?

టాలీవుడ్ తో తనదైన మార్క్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బోయపాటి శ్రీను. రవితేజ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న..

Boyapati Srinu : అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ యాక్షన్ హీరోతోనేనా..?
Boyapati
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 9:43 AM

Boyapati Srinu : టాలీవుడ్ తో తనదైన మార్క్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బోయపాటి శ్రీను. రవితేజ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న ఈ మాస్ డైరెక్టర్.. ఆ తర్వాత పలు సినిమాలు చేసి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. ఈక్రమంలోనే  బాలయ్యతో వరుసగా సింహ, లెజెండ్ సినిమాతో ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సరైనోడు అనే సినిమా చేశాడు బోయపాటి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సారి బాలకృష్ణతో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు అందులో ఒకటి అఘోర పాత్ర అవ్వడం విశేషం. ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్లు విడుదలయ్యాయి. ఈ రెండు టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అఖండ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే బోయపాటి కన్నడ స్టార్ హీరో యశ్‌తో సినిమాచేసే అవకాశాలు ఉన్నాయని ఈ ఆ మధ్య టాక్ వినిపించింది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన యశ్ ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. కేవలం కన్నడకే పరిమితమైన యశ్ క్రేజ్ కేజీఎఫ్ సినిమా తర్వాత ఒక్కసారిగా అన్నిభాషల్లో అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ రాక్ స్టార్. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం బోయపాటి తన వద్ద ఉన్న ఒక పాత కథను బయటకు తీసినట్లుగా చెబుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా వచ్చింది. ఆసమయంలో చరణ్ కు మరో రెండు మూడు కథలను కూడా వినిపించాడట. ఇప్పుడు వాటిలో ఒక కథతో యశ్ సినిమా ఉండబోతుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా రేంజ్‌లో వీరి కాంబో మూవీ వస్తుందని అంటున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని అంటున్నారు. వీరిద్దరు కలిసి ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కిస్తారని ఫిలిం సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..