బిగ్ బాస్‌లో ఊపేసింది.. సోషల్ మీడియాలో సెగలు రేపింది.. కట్ చేస్తే కనిపించకుండా పోయింది..
బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది పాపులర్ అయ్యారు. సీరియల్ నటీనటులు, సోషల్ మీడియాలో పాపులర్ అయినా వారితో పాటు సామాన్యులు కూడా హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం సీజన్ 9 నడుస్తుంది. గతంలో ఎంతో మంది ముద్దుగుమ్మలు బిగ్ బాస్ లో ఆకట్టుకున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు.

చాలా మంది హీరోయిన్స్ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. చాలా మందికి కొంతమంది బిగ్ బాస్ వరకు తెలియదు. బిగ్ బాస్ తర్వాత చాలా మంది పాపులర్ అయ్యారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యింది. తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఆఫర్స్ అందుకోలేకపోయింది కానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తన అందాలతో అభిమానులను పడేస్తోంది ఈ బ్యూటీ.
ఇంతకూ పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఇనాయ సుల్తానా. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు సంచలన దర్శకుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.
ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్ పెంచి ఓ రేంజ్ లో కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఒంటరిగా ఫోటోలు షేర్ చేస్తుంది. దాంతో నెటిజన్స్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








