ట్రైన్ నుంచి దూకి చనిపోవాలనుకుంది.. కట్ చేస్తే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. తోప్ హీరోయిన్
ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు.. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.. ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రజలు ఎక్కువ మందు ఎదుర్కుంటున్న సమ్యసల్లో డిప్రషన్ ఒకటి. చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా మంది డిప్రషన్ సమస్యను ఎదుర్కొన్నారు. కొంతమంది సినిమాల విషయంలో.. మరికొంతమంది రిలేషన్స్ షిప్స్ విషయంలో డిప్రషన్ లోకి వెళ్లారు. కొంతమంది డిప్రషన్ నుంచి బయట పడ్డారు.. మరికొంతమంది మాత్రం డిప్రషన్ వల్ల కెరీర్ కోల్పోయారు.. మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా డిప్రషన్ కారణంగా సూసైడ్ చేసుకుందామనుకున్నా అని తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమెను చనిపోయే అంత సమస్య ఏమొచ్చింది.? వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ డిప్రషన్ కు ఎందుకు గురైందో చూద్దాం.!
టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు తెలుగులో ఈ చిన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. సీరియల్స్ లో చేసిన తర్వాత సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించా.. ఆసమయంలో టీవీ నటి అంటూ చులకనగా చూశారు. ఎంతో అవమానించారు దాంతో డిప్రషన్ లోకి వెళ్ళా.. ఒకసారి డిప్రషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. కానీ నా పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మృణాల్ ప్రస్తుతం అడవి శేష్ తో కలిసి డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








