AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్, ప్రభాస్‌లకు తల్లిగా చేసి.. స్పెషల్ సాంగ్స్‌ చేసిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రభాస్ విషయానికొస్తే వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో రానున్నాడు.

మహేష్, ప్రభాస్‌లకు తల్లిగా చేసి.. స్పెషల్ సాంగ్స్‌ చేసిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం
Mahesh Babu, Prabhas
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2025 | 11:10 AM

Share

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒకే హీరోకు తల్లిగా భార్యగా నటించి మెప్పిస్తున్నారు. ఛాలెంజింగ్ రోల్ వస్తే చాలు ఎలాంటి సినిమా అయిన సరే చేయడానికి హీరోయిన్స్ రెడీగా ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అంతే..  మహేష్ బాబు, ప్రభాస్ లతో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ సినిమా ఆతర్వాత ఆ హీరోలకు తల్లిగానూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ఎంతో మంది హీరోల సరసన నటించి మెప్పించింది.. ఆమె కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి ఆ తరువాత వారికి తల్లిగా నటించిన ఏకైన హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను కవ్వించిన రమ్యకృష్ణ. ఈ స్టార్ హీరోయిన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇక హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. చాలా మంది హీరోల సినిమాల్లో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల్లోనూ  రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

మహేష్ బాబు నటించిన నాని సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఆ సాంగ్ తర్వాత తొలగించారు. కానీ ఇప్పటికీ యూట్యూబ్ లో ఆ సాంగ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక నాని సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. గుంటూరు కారం సినిమాలో మహేష్ తల్లిగా నటించింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అడవి రాముడు సినిమాలో జంటను విడదీసే అనే సాంగ్ లో కనిపించింది రమ్యకృష్ణ. ఈ స్పెషల్ సాంగ్ తర్వాత బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్ తల్లిగా నటించిన విషయం తెలిసిందే. ఇలా రమ్యకృష్ణ మహేష్ బాబుకు, ప్రభాస్ కు తల్లిగా, స్పెషల్ సాంగ్స్ చేసింది.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.