Vijay Thalapathy: విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియన్ అని మీకు తెలుసా.. ? ఫోటోస్ వైరల్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలతో మెప్పించిన ఈ హీరో.. ఇప్పుడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే విజయ్ ఫ్యామిలీ గురించి జనాలకు అంతగా తెలియదు. విజయ్ దళపతి తనయుడు జోసెఫ్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా సినీరంగంలో రాణిస్తున్నాడు.

Vijay Thalapathy: విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియన్ అని మీకు తెలుసా.. ? ఫోటోస్ వైరల్..
Vijay Thalapathy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2024 | 4:46 PM

విజయ్ దళపతికి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు విజయ్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్. ప్రస్తుతం మరో రెండు కొత్త ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అలాగే అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్.. త్వరలోనే ప్రత్యేక్ష రాజకీయాల్లో.. ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా విజయ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. విజయ్ వైవాహిక బంధంలో మనస్పర్థలు తలెత్తాయని.. ప్రస్తుతం అతడు ఓ స్టార్ హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడనే ప్రచారం మొదలైంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.

ఇదిలా ఉంటే.. విజయ్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎక్కువగా బయటపెట్టరు. కానీ విజయ్ తనయుడు సంజయ్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా కాకుండా దర్శకత్వంవైపు అడుగులు వేస్తున్నాడు. సొంతంగా సినిమాను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక విజయ్ దళపతికి ఓ కూతురు దివ్య సాషా ఉందన్న సంగతి తెలిసిందే. విజయ్ కూతురి గురించి జనాలకు అంతగా తెలియదు. దివ్య సాషా.. ఇంతకు ముందు బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. విజయ్ నటించిన తేరి చిత్రంలో నటించింది.

అయితే విజయ్ కూతురు దివ్య సాషా బ్యాడ్మింటన్ ఛాంపియన్ అని మీకు తెలుసా.. ? ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు విజయ్. దివ్య సాషా.. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్. స్కూల్లో జరిగే టోర్నమెంట్‌లో మొదటి స్థానాల్లో నిలిచింది. ఆమె మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. గతంలో దివ్య సాషాకు సంబంధించిన బ్యాడ్మింటన్ ఫోటోస్ తెగ వైరలయ్యాయి. అయితే దివ్య సాషా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ కూతురికి సంబంధించిన ఫోటోస్, వివరాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

Divya Sasha

Divya Sashaఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే