AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 సినిమాలు చేస్తే 2 హిట్స్.. తల్లి పాత్రలైనా రెడీ అంటుంది.. నెట్టింట అందాలతో గత్తర లేపుతున్న అమ్మడు

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. దాంతో కొంతమంది ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

7 సినిమాలు చేస్తే 2 హిట్స్.. తల్లి పాత్రలైనా రెడీ అంటుంది.. నెట్టింట అందాలతో గత్తర లేపుతున్న అమ్మడు
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2025 | 11:03 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. అందం, అభినయంతో మెప్పించి.. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈబ్యూటీకి ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే.. సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ తన అందాలతో మతిపోగొడుతోంది. ఆఫర్స్ అందుకోలేకపోతున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో తన అందాలతో దర్శకనిర్మాతలు ఆకర్షిస్తుంది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

తనే హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఇందులో శ్రద్ధా నటనపై ప్రశంసలు కురిపించారు. కానీ తెలుగులో అవకాశాలు రాలేదు.మొన్నామధ్య విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇటీవల విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మెకానిక్ రాకీ చిత్రంలో నటించింది. ఈ సినిమా కు మంచి అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

ఆతర్వాత బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమాలో మెరిసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే కలియుగమ్ 2064 అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రాజెక్ట్ లేనట్లు తెలుస్తోంది. మొన్నామధ్య ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలు చేసేందుకు కూడా రెడీ అంటుంది. కానీ ఆ పాత్రలకు సినిమాలో గొప్పదనం కూడా ఉండాలంటుంది. అందుకే తాను సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుందట.  తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్.. మలయాళంలో 2015లో వచచిన కోహినూర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జెర్సీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..