Tollywood: ఇండస్ట్రీని శాసించిన ఆర్మీ ఆఫీసర్ కూతురు.. స్టార్ క్రికెటర్‌ను ప్రేమించి సినిమాలకు దూరం.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ అమ్మాయి.. సినీరంగంలోకి అడుగుపెట్టి అగ్ర హీరోలతో నటించింది. తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఇండస్ట్రీనే శాసించింది. కట్ చేస్తే.. ఓ స్టార్ క్రికెటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

భారతీయ సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. కనీసం కొంత నేపథ్యం ఉంటేనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే విజయం సాధిస్తారు. ఈ జాబితాలో ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఉంది. మొదటి సినిమాతోనే ఊహించని విజయాన్ని అందుకుంది. తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో అతిపెద్ద విజయాలను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమలో పడి ఒక స్టార్ క్రికెటర్‌ను వివాహం చేసుకుంది. ఫ్యామిలీ లైఫ్ కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ఇప్పటికీ ఫ్యామిలీ, పిల్లలు అంటూ గడిపేస్తుంది. ఆమె మరెవరో కాదు అనుష్క శర్మ. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఆమె.. నటనపై ఆసక్తితో ముంబైలో తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. 2007లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో వెండెల్ రోడ్రిక్స్ లెస్ వ్యాంప్స్ షోలో ర్యాంప్ వాక్ చేసింది. ప్రసాద్ బిదపా మార్గదర్శకత్వంలో ఆమె అనేక బ్రాండ్‌లకు మోడల్‌గా వర్క్ చేసింది.
అదే సమయంలో యాక్టింగ్ స్కూల్లో చేరి ఆడిషన్లు ఇవ్వడం ప్రారంభించింది. అక్కడ ఆమె ప్రతిభను గుర్తించి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాత ఆదిత్య చోప్రా 2008లో ‘రబ్ నే బనా ది జోడి’లో షారుఖ్ ఖాన్ సరసన ఛాన్స్ ఇచ్చారు. ఈ రొమాంటిక్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. అనుష్క శర్మ వరుస హిట్లు ఇస్తూ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. హిందీలో ‘బద్మాష్ కంపెనీ’, ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘జబ్ తక్ హై జాన్’, ‘పీకే’ వంటి హిట్ చిత్రాలతో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 2016లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన ‘సుల్తాన్’ రూ.623 కోట్లు వసూలు చేసింది.
తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. 2015లోఎన్ హెచ్ 10 సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పారి, ఫిల్లౌరి, బుల్బుల్ వంటి చిత్రాలను నిర్మించింది. 2013లో ఒక షాంపూ యాడ్ షూట్ లో అనుష్క, క్రికెటర్ విరాట్ కోహ్లీ కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. నివేదికల ప్రకారం అనుష్క ఆస్తులు రూ. 255 కోట్లు. యాడ్స్ ద్వారా సంవత్సరానికి రూ.10 కోట్లకు పైగానే సంపాదిస్తుంది. ముంబైలోని వర్లిలో రూ. 34 కోట్ల విలువైన సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్, అలీబాగ్‌లో రూ. 19 కోట్ల విలువైన ఫామ్‌హౌస్ ఉన్నాయి. ఆమె వద్ద రేంజ్ రోవర్ , BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..