Hyper Aadi: పంచుల వర్షం కురిపించే హైపర్ ఆదికి పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా? ఇంటర్, బీటెక్‌లో లోనూ..
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. సందర్భమేదైనా పంచుల వర్షం కురిపించే అతను ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు. మరి ఇంతలా ఫేమస్ అయిన హైపర్ ఆది చిన్నప్పుడు చదువులో ఎలా ఉండేవాడో తెలుసుకుందాం రండి.

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయం అయ్యాడు హైపర్ ఆది. మొదట అదిరే అభి తదితరుల టీంలో కమెడియన్ గా చేసిన అతను అనతి కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత టాప్ కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నాడు హైపర్ ఆది. అల్లరి నరేష్ హీరోగా నటించిన మేడ మీద అమ్మాయి సినిమాలో నటించడంతో పాటు ఆ మూవీకి డైలాగ్ రైటర్ గా కూడా వ్యవహరించాడు ఆది. ఆ తర్వాత తొలి ప్రేమ, ఆటగదరా శివ, సవ్య సాచి, మిస్టర్ మజ్ఞు, చిత్రల హరి, వెంకీ మామ, అలా వైకుంఠపురం, క్రాక్, ధమకా, సార్, దాస్ కా ధమ్కీ, గ్యాంప్స్ ఆఫ్ గోదారి, పుష్ప2, మజాకా ఇలా ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు ఆది. మరి ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెరపై సత్తా చాటుతోన్న ఈ స్టార్ కమెడియన్ ఏం చదువుకున్నాడు? మనోడు చదువులో చురుగ్గా ఉండేవాడా? లేక యావరేజ్ స్టూడెంటా? అన్నది ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇటీవల ప్రముఖ టీవీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా స్టార్ కమెడియన్ల మార్కుల జాబితాలను ప్రదర్శించారు. అందులో హైపర్ ఆది మార్క్స్ లిస్ట్ కూడా ఉంది. కామెడీ చేయటంలోనూ, ఇతరులపై పంచ్ వేయడంలో దిట్ట అయిన హైపర్ ఆది చదువులోనూ టాపరే.
కోటా ఆదయ్య చదువులోనూ టాపరే..
హైపర్ ఆదికి పదో తరగతిలో మొత్తం 600 మార్కులకు గాను 534 మార్కులు వచ్చాయి. అనంతరం దీని గురించి మాట్లాడిన అతను.. ‘నేను ఏడో తరగతిలోనూ స్కూల్ టాపర్ . ఇప్పటికి నేను చదివిన స్కూల్ కి వెళ్తే అక్కడ టాపర్స్ లిస్టులో కోటా ఆదయ్య అని నా పేరు ఉంటుంది. ఇప్పుడు అందరికీ నేను హైపర్ ఆదిగా పరిచయమైన నా పూర్తి పేరు అదే. ఇక పదో తరగతిలో నేను స్కూల్ సెకండ్ గా వచ్చాను. ఆ తర్వాత ఇంటర్, బీటెక్ లో కూడా నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి’ అని చెప్పుకొచ్చాడు.

Hyper Aadi Marks List
హైపర్ ఆది పుట్టిన రోజున అభిమానుల అన్నదానం..
View this post on Instagram
ఇక ఇంటర్ మార్కుల విషయానికి వస్తే హైపర్ ఆదికి 1000 కిగాను ఏకంగా 945 మార్కులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో మాథ్స్ లో ఏకంగా 75 కి 75 మార్కులు తెచ్చుకోవటం విశేషం. కాగా ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు హైపర్ ఆది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. అయితే ఆ తర్వాత నటనపై మక్కువతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు.
హీరోయిన్ హన్సికతో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.