OTT Movie: రూ.16 కోట్లతో తీస్తే రూ.87 కోట్లు రాబట్టింది.. కట్ చేస్తే.. ఓటీటీనే షేక్ చేస్తోన్న చిన్న సినిమా..
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకే ఇప్పుడు టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన కొన్ని చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. చిన్న సినిమాలే ఇప్పుడు కోట్లాది మంది అడియన్స్ హృదయాలు గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చిన్న సినిమా ఓటీటీనే షేక్ చేస్తుంది. ఇంతకీ ఏంటీ ఆ సినిమా ? తెలుసుకుందామా.

థియేటర్లలో ఇప్పుడిప్పుడే చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండా.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిన్న చిత్రాలు భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. కంటెంట్ ప్రధానంగా ఉంటే చిన్న సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న ఓ చిన్న సినిమా కోట్లాది మంది అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. అదే టూరిస్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ వచ్చిన ఒక కుటుంబం కథే టూరిస్ట్ ఫ్యామిలీ. ఇందులో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జైశంకర్, కమలేష్ జగన్ ప్రధాన పాత్రలలో నటించారు.
శ్రీలంక నుంచి భారత్ చేరుకున్న ఆ కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. కానీ వారి పరిస్థితిని చూసి వెంటనే వారిని విడుదల చేస్తారు. ఆ తర్వాత తమ గుర్తింపులను దాచిపెట్టి ఆ కుటుంబం మొత్తం ఒక అద్దె ఇంట్లో నివసిస్తుంది. కుటుంబ పెద్ద ధర్మదాస్, వారు కేరళ నుండి వచ్చారని చెబుతారు. కానీ వారి ప్రవర్తన మాత్రం విభిన్నంగా ఉండడంతో వారి గురించి అసలు నిజాలు బయటకు వస్తాయి. తమిళంలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. IMDB నివేదిక ప్రకారం ఈ సినిమాను రూ.16 కోట్లతో నిర్మిస్తే.. దేశవ్యాప్తంగా రూ.71.34 కోట్లు వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.87.87 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా 283 శాతం లాభాల మార్జిన్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
దాదాపు 2 గంటల 6 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా ఇప్పుడు భారతదేశంలోని టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా దేశంలోని టాప్ 10 జాబితాలో 6వ స్థానంలో ఉంది. జూన్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాగా.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి సైతం ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..