Mrunal Thakur: ఆ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన మృణాల్.. కట్ చేస్తే.. అనుష్కతో బ్లాక్ బస్టర్ హిట్..
మృణాల్ ఠాకూర్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. సీతారామం సినిమాతో జనాలకు విపరీతంగా నచ్చేసిన హీరోయిన్. అందం, అభియనంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. తొలి చిత్రంలోనే సీతామహాలక్ష్మి పాత్రతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఓ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట.

సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మృణాల్ ఠాకూర్. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో మెరిసిన ఈవయ్యారి.. బాలీవుడ్ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట. అతడు మరెవరో కాదు.. బీటౌన్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఈ హీరో నటించిన సుల్తాన్ సినిమా 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రెజ్లర్ ప్లేయర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో అనుష్క శర్మ ఈ సినిమాలో ఆర్ఫా అనే మహిళా ప్రధాన పాత్రలో నటించింది. కానీ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ అంట.
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించిన జెర్సీ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ 15 కు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని సల్మాన్ బయటపెట్టారు. సూల్తాన్ సినిమాలో రెజ్లర్ పాత్ర పోషించగల అమ్మాయి కోసం మేకర్స్ వెతికారని.. ఆ సమయంలో మృణాల్ ను తన చిత్రం కోసం ఎంపిక చేశారని.. కానీ అర్పా పాత్రను ఆమె రిజెక్ట్ చేయడంతో చివరకు అనుష్క శర్మ వద్దకు వెళ్లిందని చెప్పుకొచ్చారు.
సూల్తాన్ సినిమాను మృణాల్ చేయకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సీతా రామం, జెర్సీ, హాయ్ నాన్న, సూపర్ 30 వంటి చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం మృణాల్ హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె ప్రస్తుతం పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రాల్లో నటిస్తుంది. అలాగే అజయ్ దేవగన్ తో కలిసి సన్ ఆఫ్ సర్దార్ 2 లో కనిపించనుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..