Tollywood: చేసింది రెండే సినిమాలు.. ఆస్తులు రూ.10 వేల కోట్లు.. ఈ యంగ్ హీరో ఎవరంటే..
సినీరంగంలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నటులుగా గుర్తింపు తెచ్చుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్న హీరోస్ గురించి చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో మాత్రం కేవలం రెండు సినిమాల్లోనే నటించాడు. కానీ ఆస్తులు మాత్రం రూ. 10 వేల కోట్లు. ఇంతకీ అతడు ఎవరంటే..

సాధారణంగా నటనపై ఆసక్తితో వివిధ రంగాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. కానీ మీకు తెలుసా.. బిజినెస్ కోసం ఇండస్ట్రీని వదిలేసిన తారలు ఉన్నారు. కొందరు కార్పొరేట్ వెంచర్స్, సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు సినీరంగాన్ని వదిలిపెట్టారు. అలాంటి వారిలో ఈ హీరో ఒకరు. హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. కేవలం రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఇప్పుడు వ్యాపారసామ్రాజ్యంలో మాత్రం రూ.10 వేల కోట్లకు అధిపతి అయ్యారు. అతడు మరెవరో కాదండి.. హీరో గిరీష్ కుమార్. కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ తో కలిసి తన మొదటి సినిమా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
2013లో వచ్చిన రామయ్య వస్తావయ్యా సినిమాతో హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. ఆ తర్వాత 2016లో లవ్ ఘడా అనే చిత్రంలో కనిపించారు. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడు గిరీష్. ఇప్పుడు అతడు విజయవంతమైన కార్పొరేట్ లీడర్. అలాగే టిప్స్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీ విలువ రూ. 4,700 కోట్లు. గిరీష్ కుమార్ చిత్రనిర్మాత కుమార్ ఎస్. తౌరానీ కుమారుడు. అలాగే టిప్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు రమేష్ ఎస్. తౌరానీ మేనల్లుడు.
నటనపై ఆసక్తితో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా కేవలం రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినీరంగం నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రితోపాటు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుుడు అతడు టిప్స్ ఇండస్ట్రీస్ COO. డిసెంబర్ 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,517 కోట్లు. నివేదికల ప్రకారం అతడి ఆస్తుల విలువ దాదాపు రూ. 2,164 కోట్లుగా అంచనా. గిరీష్ కుమార్ తన చిన్ననాటి ప్రియురాలు కృష్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు ఉన్నారు. గిరీష్ టిప్స్ మ్యూజిక్‌లో ప్రమోటర్ , ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..