Tollywood : ఈ కశ్మీరీ అందం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. చిరుతో సూపర్ హిట్స్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం..
ఒకప్పుడు ఆమె సీనియర్ హీరోయిన్. అప్పట్లో కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సహాయ పాత్రలలో మెప్పిస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ కశ్మీరీ అందాన్ని గుర్తుపట్టారా.. ?

సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరలవుతుంది. కశ్మీరీ అందంలో ఉన్న ఆమె ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ? అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఆమె ఎవరో. కొన్నేళ్ల క్రితం నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్. 80,90sలో ఎన్నో హిట్స్ అందుకున్న అగ్ర కథానాయికగా మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే కమల్ హాసన్, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో హీరోయిన్ గా అలరించింది. కథ, పాత్ర నచ్చితే ఢీగ్లామర్ రోల్స్ సైతం చేసింది. ఇక ఇప్పుడు వయసుకు తగినట్లుగా తల్లి, అత్త పాత్రలలో నటిస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా కనిపిస్తుంది. అటు రాజకీయాల్లోనూ రాణిస్తుంది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్.
రాధిక శరత్ కుమార్.. సినీరంగానికి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె తండ్రి కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు, హాస్యనటుడు MR రాధ. పైన ఫోటోలో కనిపిస్తున్న ఫోటో శ్రీలంక గీతా సినిమాలోనిది. రాధిక తన విద్యను భారత్, శ్రీలంక, యుకెలో పూర్తి చేసింది. 1978లో డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వం వహించిన ఇష్కిష్కే పోమియా రైల్ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో అత్యధికంగా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రాధిక జోడికి అప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. చిరంజీవి, కమల్ హాసన్, రజినీ వంటి స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో నటించింది.
రాధిక కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ ను 2001 ఫిబ్రవరి 4న పెళ్లి చేసుకుంది. అంతకు ముందు వీరిద్దరు కలిసి నమ్మ అన్నాచ్చి (1994), సూర్యవంశం (1997) నటించారు. వీరికి ర్యానే హార్డీ, రాహుల్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాధిక నిర్మాత కూడా. సొంతంగా రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ ఉంది. కొన్నాళ్ల క్రితం బీజేపీ ఎంపీగా పోటీ చేసిన రాధిక ఒడిపోయింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..