Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: కష్టాల్లో కన్నప్ప సినిమా.. మంచు విష్ణు, డైరెక్టర్‌తో పాటు మోహన్ బాబుకు నోటీసులు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఒక భారీ పాన్-ఇండియా సినిమా కన్నప్ప. ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు.

Kannappa: కష్టాల్లో కన్నప్ప సినిమా.. మంచు విష్ణు, డైరెక్టర్‌తో పాటు మోహన్ బాబుకు నోటీసులు
Kannappa
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2025 | 10:18 AM

Share

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జిన్నా సినిమా తర్వాత విష్ణు హిస్టారికల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి ఏదోఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది.. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఆతర్వాత హార్డ్ డిస్క్ దొంగతనం జరగడం.. ఇక ఇప్పుడు సినిమా పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం..

కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన ‘పిలక’, ‘గిలక’ పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తున్నాయని, సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. సినిమాలోని పాత్రల పేర్లు, సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ..  బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్‌ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ అధికారి, ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, డైరెక్టర్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్, మంచు మోహన్‌బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి.వెంకట ప్రభుప్రసాద్‌, సప్తగిరికి నోటీసులు జారీచేసింది కోర్టు.

తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. కాగా ఈ నెల 27న సినిమా విడుదలకానుంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు, ‘మహాభారతం’ కు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖేష్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నప్ప పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో అతిథి పాత్రలలో ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతి), మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ (కథానాయిక), మధుబాల, బ్రహ్మానందం, రఘు బాబు తదితరులు నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో