Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నావల్లే అమ్మకి పక్షవాతం వచ్చింది.. 99శాతం బతకదని చెప్పారు.. ఎమోషనలైన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ వల్ల చాలా మంది పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాతో పాపులర్ అయిన వారిలో ఈ అమ్మడు ఒకరు. బిగ్ బాస్ వల్ల చాలా మందికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆతర్వాత చాలా పాపులర్ అయ్యి.. ఇప్పుడు టీవీ షోలతో అదరగొడుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది ముందుగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది.

నావల్లే అమ్మకి పక్షవాతం వచ్చింది.. 99శాతం బతకదని చెప్పారు.. ఎమోషనలైన బిగ్ బాస్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2025 | 10:18 AM

Share

సినిమా హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమా ముద్దుగుమ్మలే కాదు సీరియల్, టీవీ షోల్లో అలరించే అందాల భామలు కూడా తమ అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ బ్యూటీస్ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ కూడా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే సీరియల్ బ్యూటీ కూడా చాలా పాపులర్.. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. టీవీ సీరియల్స్, టీవీ షోలతో పాటు బిగ్ బాస్ హౌస్ లోనూ సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.. అంతే కాదు తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. తన వల్లే తన తల్లికి పక్షవాతం వచ్చింది అని చెప్పి షాక్ ఇచ్చింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే..

సీరియల్స్ లో నటించి ఆతర్వాత బిగ్ బాస్ గేమ్ షోతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న భామల్లో శ్రీ సత్య ఒకరు. ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు, మరియు త్రినయని సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి శ్రీసత్య. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. Ms. AP టైటిల్‌ను కూడా గెల్చుకుంది. ఆతర్వాత నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాగా 2017లో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది శ్రీసత్య. గోదారి నవ్వింది, లవ్ స్కెచ్ సినిమాల్లోనూ కనిపించింది. ఈక్రమంలోనే సీరియల్స్‌లోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె తన ఆటతో, అందంతో ఆకట్టుకుంది. తాజాగా కాకమ్మ కథలు సీజన్ 2లో పాల్గొంది. ఈ షోలో శ్రీసత్య ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే తన జీవితంలో జరిగిన విషాదం గురించి చెప్పింది.. శ్రీ సత్య మాట్లాడుతూ.. నేను ఇంట్లో పట్టించుకోనూ.. నాకు ఫుడ్ పెట్టారా తిన్నన్నా అనేది మాత్రమే చూసుకుంటా.. కనీసం ఇంట్లో ఎవరైనా తిన్నారా అనేది కూడా చూడను.. బేసిక్ గా నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం.. ప్రేమకోసం తపించేదాన్ని.. దానివల్లే ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి.. మా అమ్మకు పక్షవాతం వచ్చింది.. అప్పటి నుంచి ఆమె అదే పరిస్థితిలో ఉన్నారు మా అమ్మ. ఒక లవ్ కోసం నేను చెయ్యి కోసుకున్నా.. బ్రేకప్ వల్ల నేను రూమ్ లో నుంచి బయటకురాలేదు.. అది మా అమ్మగారి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. దాన్ని మా అమ్మ తీసుకోలేకపోయింది. నేను బ్రేకప్ వల్ల అంత బాధపడటం చూసి బీపీ ఎక్కువైపోయి అమ్మకి బ్రెయిన్‌ డిస్ట్రబ్ అయ్యింది. 99 పర్సెంట్ అమ్మ బతకదని చెప్పేశారు. నేను ఒక్కదాన్నే మా నాన్నకు షుగర్. నాకు తోడుగా ఎవ్వరూ లేరు.. నేను ఒక్కదాన్నే ఆసుపత్రిలో 30 రోజులు ఉన్నాను. అప్పుడు అర్ధమైంది నాకు అసలైన బాధ్యత అంటే ఏంటో.. అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sri Satya (@sri_satya_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో