ఈ నటుడి బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా.. గుండు వెనక అసలు కథ ఇదేనట
ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించాడు. ఆయన పేరు మొట్టా రాజేంద్రన్ కానీ ఆయన పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు కానీ చూస్తే మాత్రం టక్కున నవ్వేస్తారు. హీరో సూర్య నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత రాజారాణి సినిమాలో హీరో పని చేసే ఆఫీస్ లో బాస్ గా నటించాడు.

కమెడియన్ మోట రాజేంద్రన్.. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆయన చూస్తే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు రాజేంద్రన్. కెరీర్ బిగినింగ్ లో ఫైటర్ గా చేసిన ఆయన ఆతర్వాత కమెడియన్ గా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన 67 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్ రహస్యాలను, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల మధ్య బంధాన్ని పంచుకున్నారు.
రాజేంద్రన్ తన కెరీర్‌ను ఫైటర్‌గా ప్రారంభించారు. సుమారు 45 సంవత్సరాల క్రితం మాస్టర్ విజయన్ దగ్గర అసిస్టెంట్‌గా, ఫైటర్‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాగబాబు వంటి తెలుగు స్టార్‌లతో సహా పలువురితో కలిసి ఫైట్ సీక్వెన్స్‌లలో పనిచేశానని తెలిపారు. అలాగే చిరంజీవి నటన, పంచులు విసిరే శైలి అంటే తనకు చాలా ఇష్టమని ఆయన పేర్కొన్నారు. రాజేంద్రన్ కుటుంబ నేపథ్యం కూడా ఫైటర్లదే కావడం విశేషం. తన తండ్రి, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అందరూ ఫైటర్లేనని అలాగే తానూ కూడా ఈ రంగంలోకి వచ్చానని అన్నారు. అయితే, ఆయన హెయిర్ స్టైల్ వెనుక ఒక కథ ఉందని తెలిపారు. కెమికల్ వాటర్‌లో పడటం వల్ల తన జుట్టు, కనుబొమ్మలు రాలిపోయాయని అన్నారు.
ఈ సంఘటన తర్వాత బాల దర్శకత్వంలో వచ్చిన పితామగన్ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం వచ్చిందని, ఆ తర్వాత కామెడీలోకి అడుగుపెట్టి, ఇప్పుడు స్టార్ కమెడియన్‌గా కొనసాగుతున్నట్టు తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం పట్ల రాజేంద్రన్ చాలా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు థియేటర్లలో తనను చూసి విజిల్స్ వేస్తే ఆనందంతో ఒక్కోసారి కన్నీళ్లు కూడా వస్తాయని ఎమోషనల్ అయ్యారు. తమిళంలో బిజీగా ఉండటం వల్ల తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నానని, సమయం కుదిరినప్పుడల్లా ఇక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతానని అన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల మధ్య భాష ఒక్కటే తేడా అని, తెలుగు పరిశ్రమలో తనకు లభించే గౌరవం మరింత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో కట్టప్ప లాంటి మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని, అందుకు తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన వయసు 67 అయినప్పటికీ, తాను ఎప్పుడూ 25 ఏళ్ల యువకుడిలా ఫీల్ అవుతున్నానని అన్నారు. రోజుకు ఒక గంట పాటు వర్కౌట్స్, డంబెల్స్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు చేస్తానని తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
