Cooking Tips: కూరలో పొరబాటున ఉప్పు ఎక్కువ పడిందా? కంగారొద్దు.. ఇలా చేస్తే రుచి చెడిపోదు
ఆహార రుచిని పెంచడంలో ఉప్పు పాత్ర మెజారిటీ వంతు ఉంటుంది. ఉప్పు అస్సలు లేకపోయినా.. కొంచెం ఎక్కువ ఉప్పు ఉన్నా ఆహారం రుచి చెడిపోతుంది. ఎక్కువ ఉప్పు ఉన్నప్పుడు చాలా మంది తాము చేసిన కష్టమంతా వృధా అయిందని భావించి ఆహారాన్ని చెత్తలో పడేస్తుంటారు. ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉంటే ఆందోళన గురికావలసిన..

ఆహార రుచిని పెంచడంలో ఉప్పు పాత్ర మెజారిటీ వంతు ఉంటుంది. ఉప్పు అస్సలు లేకపోయినా.. కొంచెం ఎక్కువ ఉప్పు ఉన్నా ఆహారం రుచి చెడిపోతుంది. ఎక్కువ ఉప్పు ఉన్నప్పుడు చాలా మంది తాము చేసిన కష్టమంతా వృధా అయిందని భావించి ఆహారాన్ని చెత్తలో పడేస్తుంటారు. ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉంటే ఆందోళన గురికావలసిన అవసరం లేదు. ఈ కింది కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా మీ వంట రుచిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఎలాగంటే..
వంటలో ఉప్పు ఎక్కువగా పడితే ఏం చేయాలి?
పెరుగు వేయండి
ఎక్కువ ఉప్పు వల్ల వంటకం రుచి చెడిపోతే రుచిని సమతుల్యం చేయడానికి మీరు వంటకంలో పెరుగు వేయవచ్చు. వంటకంలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇది ఉప్పు శాతాన్ని సమతుల్యం చేస్తుంది. ఇలా చేయడం వల్ల వంటకం రుచి కూడా మెరుగుపరుస్తుంది.
శనగ పిండి
మీరు వేయించిన శనగ పిండిని కూడా ఉపయోగించవచ్చు. మీ వంటకంలో పొరబాటున ఉప్పు ఎక్కువ పడితే వేయించిన శనగ పిండిని జోడించవచ్చు. ఇది అదనపు ఉప్పును సమతుల్యం చేస్తుంది. వంటకం రుచిని మెరుగుపరుస్తుంది.
ఉడికించిన బంగాళాదుంపలు
ఉడికించిన బంగాళాదుంపలను ఉపయోగించడం ద్వారా వంటలో ఉప్పదనాన్ని గరిష్ఠంగా తగ్గించవచ్చు. ఉప్పు ఎక్కువగా ఉంటే ఉడికించిన బంగాళాదుంపలను కోసి మీరు తయారుచేసిన వంటకంలో వేసి బాగా కలపాలి. ఇది ఉప్పును గ్రహిస్తుంది. మీరు వంటలో పచ్చి బంగాళాదుంప ముక్కలను కూడా ఇందులో వేయవచ్చు.
నిమ్మరసం
వంటలో ఉప్పు శాతాన్ని సమతుల్యం చేయడంలో నిమ్మరసం కూడా సహాయపడుతుంది. ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే వంటకంలో సగం నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. ఇది అదనపు ఉప్పు శాతాన్ని సమతుల్యం చేస్తుంది.
కొబ్బరి పాలు
గ్రేవీ చాలా ఉప్పగా ఉంటే మీరు దానికి కొబ్బరి పాలు జోడించవచ్చు. మీరు కొబ్బరి పాలతో కొద్దిగా నీరు కలిపి గ్రేవీలో కలపవచ్చు. ఇది వంటకం రుచిని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల అదనపు ఉప్పును సమతుల్యం చేస్తుంది.
చక్కెర
వంట ఉప్పగా అనిపిస్తే అందులో కొద్దిగా చక్కెర లేదా బెల్లం కలపాలి. చక్కెర తీపి ఉప్పు మొత్తాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




