కళ్ల రంగుతోనే మీ గుట్టు రట్టు.. రహస్యాలు ఎలా తెలుసుకోవచ్చంటే..?
మీ కళ్ల రంగు మీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? నలుపు, గోధుమ, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగు కళ్లు ఉన్నవారికి ఎలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి..? మీ కళ్ల రంగు మీ అంతర్గత స్వభావాన్ని, రహస్యాలను ఎలా బయటపెడుతుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం లేదా హస్తసాముద్రికం వంటివి చూస్తుంటాం. అయితే శరీర భాగాల ఆకృతిని బట్టి కూడా వారి స్వభావాన్ని చెప్పవచ్చని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ల రంగు ఒక వ్యక్తి అంతరాత్మకు అద్దం పడుతుందని, వారి ప్రవర్తన, రహస్యాలను వెల్లడిస్తుందని అంటారు. మీ కళ్ల రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్లటి కళ్లు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఉండే రంగు ఇది. నల్లటి కళ్లు ఉన్నవారు అపారమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు ఏ పని చేపట్టినా ఎంతో నిబద్ధతతో, హృదయపూర్వకంగా చేస్తారు. వీరు ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయడంలో దిట్ట. ప్రేమ విషయానికొస్తే తమ భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. అత్యంత నమ్మదగిన వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు.
గోధుమ రంగు కళ్లు
గోధుమ రంగు కళ్లు ఉన్నవారు ఇతరులను సులభంగా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటారు. వీరు సహజంగా చాలా మంచి మనస్తత్వం ఉన్నవారు. ఎంతటి కష్టాన్నైనా తెలివిగా ఎదుర్కొంటారు. వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ. జీవితంలో ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
బూడిద రంగు కళ్లు
బూడిద రంగు లేదా గ్రే కలర్ కళ్లు ఉన్నవారు చాలా విశాల దృక్పథం కలిగి ఉంటారు. వీరు జీవితంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. తాము స్వేచ్ఛగా ఉంటూనే తమ కుటుంబ సభ్యులకు కూడా అలాంటి వాతావరణాన్నే కల్పిస్తారు. వీరు చాలా ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు.
నీలి కళ్లు
నీలి కళ్లు ఉన్నవారు చాలా సున్నిత మనస్కులు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. వీరు జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. కొన్నిసార్లు ఇతరులకు మేలు చేసే క్రమంలో తాము ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి.
ఆకుపచ్చ కళ్లు
ఆకుపచ్చ కళ్లు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. వీరు చాలా తెలివైన వారు. వీరికి దేనినైనా లోతుగా అర్థం చేసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. రహస్యాలను ఛేదించడంలో విజయం సాధిస్తారు. తమ వృత్తి పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు. జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించాలని కోరుకుంటారు.
కళ్ల రంగు ద్వారా తెలిసే ఈ లక్షణాలు కేవలం జ్యోతిష్య, శరీర శాస్త్ర అంచనాలు మాత్రమే. ప్రతి వ్యక్తిలోనూ వారి పెరిగిన వాతావరణం, అనుభవాల బట్టి మార్పులు ఉండవచ్చు. మీ కళ్ల రంగు ఏంటో చూసుకుని, పైన చెప్పిన లక్షణాలు మీకు ఎంతవరకు సరిపోతున్నాయో చెక్ చేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




