AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. పెళ్లైన 27 రోజులకే ఇంత ఘోరమా.. అత్తగారింట్లో ఊహించని ఘటన..

పెళ్లై 27 రోజులు.. నూరేళ్ళ జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ అంతలోనే ఊహించని ఘటన జరిగింది..? రాజీ కుదిరిన గంటల వ్యవధిలోనే ఆ గదిలో ఏం జరిగింది? తలుపులు పగలగొట్టకుండానే భర్త లోపలికి ఎలా వెళ్ళాడు? నవవధువు ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందా..? లేక హత్య చేశారా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అయ్యో దేవుడా.. పెళ్లైన 27 రోజులకే ఇంత ఘోరమా.. అత్తగారింట్లో ఊహించని ఘటన..
Newlywed Bride Dies Suspiciously
Krishna S
|

Updated on: Dec 25, 2025 | 6:09 PM

Share

మూడు ముళ్ల బంధం, నూరేళ్ల జీవితం అంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతి ఆశలు నెల తిరగకుడానే అడియాశలయ్యాయి. వివాహమై కేవలం 27 రోజులు గడవకముందే నవవధువు ఐశ్వర్య (26) అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన కర్ణాటకలోని నెలమంగళ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నాగమంగళకు చెందిన మమత, కృష్ణమూర్తి దంపతుల కూతురు ఐశ్వర్యకు, మల్లసంద్ర నివాసి లిఖిత్ సింహాతో గత నెలలో ఘనంగా వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ పెళ్లైన కొద్దిరోజుల నుండే ఐశ్వర్యకు వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తగారి వేధింపుల గురించి ఐశ్వర్య తన తల్లిదండ్రులకు చెప్పుకుని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది.

రాజీ కుదిరిన రోజే దారుణం

ఐశ్వర్య వైవాహిక జీవితంలో తలెత్తిన గొడవలను పరిష్కరించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు రాజీ సమావేశం నిర్వహించారు. అంతా సర్దుకుంటుందని భావించి ఐశ్వర్యను అత్తగారింటికి పంపారు. అయితే అదే రోజు సాయంత్రం లిఖిత్ సింహా తన అత్తగారికి ఫోన్ చేసి.. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది అని సమాచారం అందించాడు. ఐశ్వర్య తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తలుపులు పగలగొట్టకుండానే లోపల ఉన్న శవం వద్దకు భర్త ఎలా వెళ్ళాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిఖిత్ సింహానే తన కూతురును గొంతు పిసికి చంపి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేసి ఉండవచ్చని ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఐశ్వర్య భర్త లిఖిత్ సింహాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే ఇది హత్యా లేక ఆత్మహత్యా అనేది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. కన్న కూతురి అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయ్యో దేవుడా.. పెళ్లైన 27 రోజులకే ఇంత ఘోరమా.. ఏం జరిగిందంటే..?
అయ్యో దేవుడా.. పెళ్లైన 27 రోజులకే ఇంత ఘోరమా.. ఏం జరిగిందంటే..?
డైనోసార్ల కంటే పాతవి.. ఆరావళి పర్వతాల గురించి మీకు తెలుసా?
డైనోసార్ల కంటే పాతవి.. ఆరావళి పర్వతాల గురించి మీకు తెలుసా?
పారిపోయి ప్రియుడితో యువతి పెళ్లి... తండ్రి షాకింగ్ డెసిషన్!
పారిపోయి ప్రియుడితో యువతి పెళ్లి... తండ్రి షాకింగ్ డెసిషన్!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఏలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఏలా ఉంటుంది..
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
తిన్న తర్వాత ఎన్ని అడుగులు నడవాలి.. ఎక్కువ నడిస్తే ఏమవుతుంది..?
తిన్న తర్వాత ఎన్ని అడుగులు నడవాలి.. ఎక్కువ నడిస్తే ఏమవుతుంది..?
'ధురంధర్' మూవీ హీరోయిన్ తండ్రి టాలీవుడ్‌ స్టార్ నటుడని తెలుసా?
'ధురంధర్' మూవీ హీరోయిన్ తండ్రి టాలీవుడ్‌ స్టార్ నటుడని తెలుసా?
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
కొత్త కళ.. ఇండస్ట్రీని పలకరిస్తున్న కొత్తమ్మాయిలు వీడియో
కొత్త కళ.. ఇండస్ట్రీని పలకరిస్తున్న కొత్తమ్మాయిలు వీడియో