Andhra: అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన వివాహిత శొఠ్యాం పుష్ప (20) మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన పుష్ప, ఎరుకొండ గ్రామానికి చెందిన శొఠ్యాం శివ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన వివాహిత శొఠ్యాం పుష్ప (20) మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన పుష్ప, ఎరుకొండ గ్రామానికి చెందిన శొఠ్యాం శివ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు తెలియకుండా పుష్ప ఇంటి నుంచి వెళ్లిపోవడంతో విషయం బయటపడింది. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో ముందుగా రిజిస్టర్ వివాహం జరిపించగా, మూడు నెలల క్రితం పూసపాటిరేగలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి నిర్వహించారు. వివాహానంతరం పుష్ప, శివ ఎరుకొండలో కలిసి నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్ప ఉరివేసుకుంది. చివరి క్షణాల్లో ఆమెను గమనించిన భర్త శివ వెంటనే భోగాపురం సీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్‌తో పాటు తహసీల్దార్ ఎన్వీ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అయితే.. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తుంది. కొద్ది రోజులుగా పుష్పను వరకట్నం తీసుకురావాలని భర్త శివతో పాటు అతని కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేశారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని, అడిగిన మొత్తాన్ని ఇవ్వలేకపోవడంతోనే వేధింపులు పెరిగాయని వారు ఆరోపించారు.
ఈ వేధింపులను తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. పెళ్లైన మూడునెలలకే కుమార్తెను ఈ విధంగా కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
