రివ్యూలు చూసి గుడ్డిగా వెళ్లకుండా ఉండటానికి పిచ్చోళ్లు కాదు.. నిర్మాతల ఆవేదన
సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంపై నిర్మాతలు నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలు చూడకుండా రివ్యూలు రాసి సినిమాలను చంపేస్తున్నారని నిర్మాతలు వాపోయారు. సినిమా గురించి చాలా అసహ్యకరమైన బూతులతో రివ్యూలు రాస్తున్నారని ఆరోపించారు నిర్మాతలు.

ఇటీవలే థియేటర్స్ లోకి ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది ఈషా. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. కాగా ఈ సినిమా పై నెగిటివ్ రివ్యూస్ రావడం పై నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో పెయిడ్ మాఫియా ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత వంశీ నందిపాటి. బుక్ మై షో పేరుతో మాఫియా జరుగుతుందని ఆయన అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కావాలనే రేటింగ్‌లు తగ్గిస్తున్నారు.. నెగిటివ్ మాఫియా ఎక్కువైపోయింది. మా మీద నెగిటివ్ చేస్తుంటే కూడా చూస్తూ కూర్చోము అనేది మీకు తెలియాలి.. జనాలు పిచ్చోళ్లు కాదు.. రివ్యూలు చూసి గుడ్డిగా నమ్మేసి పోకుండా ఉండటానికి.. యుఎస్‌లో ఉండే ఓ మనిషి సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నాడు.. ఎక్కడ చూసారు మీరు అని అడిగితే ఇండియాలో చూసాను అన్నాడు.. అదెక్కడ అంటే కాదు ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు చూసి చెప్పారంటున్నాడు అని నిర్మాత వంశీ నందిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ.. మనం ఉన్నది అడవిలో కాదు.. సమాజంలో ఉన్నాం. ఒకరు బతికితే మనం కూడా బతకాలి. అడవిలో అయితే చంపి బతుకుతాయి. కానీ ఇక్కడ మాత్రం అసహ్యకరమైన బూతులతో రివ్యూలు రాస్తున్నారు. మంచి రివ్యూలను మేం రెస్పెక్ట్ చేస్తున్నాం కానీ కావాలనే నెగిటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. రాత్రికి బాగున్న సినిమా పొద్దున్నకే ఎలా బాగోకుండా పోతుంది. రెండు మూడు సినిమాలు వచ్చినా కూడా మంచిగా ఆడిన సందర్భాలున్నాయి. ఒకర్ని ఒకరు ఎందుకు చంపుకోవాలని చూస్తున్నారు.. మరో సినిమాను చంపితే కానీ మిగిలిన సినిమాలు ఆడవా..?
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. చాలా కాంపిటీషన్‌లో సినిమాను రిలీజ్ చేసాను.. ఇదివరకు సోషల్ మీడియా లేనపుడు డిస్కషన్స్ ఉండేవి.. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.. మేం ఎక్కడ బాధ పడుతున్నామంటే ప్రీమియర్స్ వేసాం.. 200 టికెట్లు బుక్ చేస్తారు.. అవి అవ్వగానే 1 రేటింగ్ వేస్తూ వెళ్తారు. 300 టికెట్లు కొడితే రేటింగ్ అలా తగ్గిపోతుంది. బుక్ మై షోలో 30 నుంచి 50 వేలు ఖర్చు పెడితే చాలు నెగిటివ్ క్యాంపైన్ అయిపోతుంది. కొన్నిసార్లు రైట్ సైడ్, రాంగ్ సైడ్ రివ్యూలు ఉంటాయి. కానీ బుక్ మై షోలో అలా కాదు.. కావాలని కొడుతూ ఉంటారు. ఈవెనింగ్ వరకు వెయిట్ చేస్తే సినిమాకు ఆటోమేటిక్‌గా రేటింగ్ పెరుగుతుంది.. దయచేసి వ్యాల్యూ లేని రేటింగ్‌కు విలువ ఇవ్వొద్దు. 300 టికెట్లు ఫేక్ చేస్తే.. మేం ఒరిజినల్‌గా 300 మంది చూసి రివ్యూ పెట్టేవరకు వెయిట్ చేయాలి. సినిమా బాగోకపోతే బుక్ మై షోలో టికెట్ ట్రెండ్స్ కనిపించదు. ఈ రోజు, రేపు కూడా మంచి బుకింగ్స్ ఉన్నాయి.. డీసెంట్‌గా వెళ్లే సినిమాను ఇటు తోస్తే ఇటెళ్తుంది.. అటు తోస్తే అటు వెళ్తుంది.. పెద్ద సినిమాను డిస్టర్బ్ చేయలేరు.. కానీ చిన్న సినిమాలకు అలా కాదు.. నెగిటివ్ చేసి సినిమాను చంపేయాలని చూస్తున్నారు. వేరే సినిమాలకు మేం వెళ్లం.. కానీ మా మీద జరుగుతున్నాయి నెగిటివ్ కాంపైనింగ్. ఈ రోజు సోషల్ మీడియా చాలా ఆర్గనైజ్డ్‌గా వెళ్తుంది.. దాని మీద రాయండి. బూతులు తిడుతూ రివ్యూలు రాస్తారా ఎవరైనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
