The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా కోసం అదా శర్మ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా ?..
ఇప్పటివరకు ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రోజు రోజుకూ ఈసినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను ఆగట్టుకుంటుంది. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాతో హీరోయిన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇటీవల వివాదాస్పద సినిమాగా విడుదలై రూ. కోట్లు వసూళ్లు చేస్తోన్న సినిమి ది కేరళ స్టోరీ. ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు రాష్ట్రాలలో నిరసనలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయగా.. మరోవైపు మిగతా రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రోజు రోజుకూ ఈసినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను ఆగట్టుకుంటుంది. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాతో హీరోయిన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ది కేరళ స్టోరీ చిత్రంలో అదా శర్మ నటనకు ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాకుండా ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు కూడా క్యూకడుతున్నాయి. అయితే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ది కేరళ స్టోరీ సినిమాకు అదా శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రం కోసం అదా శర్మ ఏకంగా రూ. 1 కోటి పారితోషికం తీసుకుందట. ఇందులో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ, అదా శర్మ ప్రధాన పాత్రలలో నటించగా.. వీరిలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ అదా శర్మ కావడం గమనార్హం.
ఇందులో మిగతా నటీమణులు ఒక్కొక్కరు రూ. 30 లక్షలు తీసుకున్నారట. ఇక విజయ్ కృష్ణకు రూ. 25 లక్షలు, ప్రణయ్ పచౌరీకి రూ. 20 లక్షలు, ప్రణవ్ మిశ్రాకు రూ. 15 లక్షలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు వివాదాలు చుట్టుముడుతున్న ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.