Tollywood: రవి కిరణాల వెలుగులో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..?
ముఖ్యంగా ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయింది. ఇక ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యింది

రవి కిరణాల వెలుగులో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై సైతం సందడి చేస్తుంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయింది. ఇక ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యింది తనే. ఇనయ సుల్తానా. బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఇనయకు డాన్స్ చేయడం, షాపింగ్ చేయడం అంటే ఇష్టమట. ఈ షోతో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం క్రాంతి మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి భీమ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇనయ లుక్ ఆకట్టుకుంది.
బిగ్ బాస్ షోలో ఇనయ తన ఆట తీరుతు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మాయి ఆడపులిలా బిగ్ బాస్ లో పోరాడింది. దీంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో తర్వాత నెట్టింట ఇనయ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంది. తాజాగా సముద్ర తీరాన ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.




View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



