Nayanthara : ఏంటీ.. ఇతను నయనతార అన్నయ్య.. ? వైరలవుతున్న ఫోటోస్.. బ్యాగ్రౌండ్ ఇదే..
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కుర్ర హీరోయిన్లకు సీనియర్ ముద్దుగుమ్మలు గట్టిపోటీనిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నయనతార నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ నయన్ స్టార్ హీరోలకు పోటీగా పారితోషికం తీసుకుంటుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ తనదైన ముద్ర వేసింది. ఇటీవలే షారుఖ్ ఖాన్ జోడిగా జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ ఒకరు. తెలుగు, తమిళం భాషలలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. సినిమా గురించి కాకుండా ఎప్పుడూ పర్సనల్ విషయాలతోనే ఫేమస్ అవుతుంది నయన్. ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఉయూర్, ఉలాగ్ అనే ట్విన్స్ జన్మించిన సంగతి తెలిసిందే. అయితే నయనతార ఫ్యామిలీ గురించి జనాలకు అంతగా తెలియదు.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
కేరళకు చెందిన నయన్ అసలు పేరు డయానా. ఆమె తండ్రి పేరు కురియన్ కొడియాతు.. తల్లి ఒమన్ కురియన్. నయనతారకు సోదరుడు సైతం ఉన్నారు. అతడి పేరు లెనో. అయితే ఇప్పటివరకు నయన్ తల్లిదండ్రుల గురించి జనాలకు తెలుసు.. కానీ ఆమె సోదరుడి గురించి జనాలకు అంతగా తెలియదు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. నయన్, విఘ్నేష్ శివన్ ఇద్దరితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అతడు దుబాయ్ లో బిజినెస్ చేస్తున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..




