K.Raghavendra Rao: రూ.80 కోట్ల ఖర్చు అనడానికి నీ దగ్గర లెక్కలున్నాయా ?.. తమ్మారెడ్డి కామెంట్స్‏పై దర్శకేంద్రుడి రియాక్షన్..

తెలుగు సినిమాకు ప్రపంచ వేదికలపై వస్తున్న పేరు చూసి గర్వపడాలని అన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు రాఘవేంద్రరావు.

K.Raghavendra Rao: రూ.80 కోట్ల ఖర్చు అనడానికి నీ దగ్గర లెక్కలున్నాయా ?.. తమ్మారెడ్డి కామెంట్స్‏పై దర్శకేంద్రుడి రియాక్షన్..
Raghavendra Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2023 | 6:42 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలపడానికి చిత్రయూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బుతో ఎనిమిది సినిమాలు తీసి మొఖాన కొడతామంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్.. సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తమ్మారెడ్డి కామెంట్స్‏కు మెగా బ్రదర్ నాగబాబు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం తమ్మారెడ్డికి చురకలంటించారు. ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందనడానికి నీ దగ్గర లెక్కలున్నాయా? అంటూ ప్రశ్నించారు. తెలుగు సినిమాకు ప్రపంచ వేదికలపై వస్తున్న పేరు చూసి గర్వపడాలని అన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు రాఘవేంద్రరావు.

“మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకు.. తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి… అంతేకానీ రూ. 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ?. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన తెలుగు సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్ధేశమా ? ” అంటూ ప్రశ్నించారు రాఘవేంద్రరావు.

ఇవి కూడా చదవండి

దర్శకేంద్రుడి ట్వీట్ కు నెటిజన్స్ నుంచి మద్దతు వస్తోంది. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినిమా బడ్జెట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ. 200 కోట్లు పెట్టి రాజమౌళి సినిమా తీశారని.. ఆ రోజుల్లో ఇది చాలా ఎక్కువ బడ్జెట్ కానీ.. ఆయన తీసింది విజయవంతమైన సినిమా. అలాగే రూ. 600 కోట్లు పెట్టి ఆర్ఆర్ఆర్ సినిమా తీశారు.. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు పెట్టారు.. ఆ డబ్బు తనకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.