Ram Charan: అది తల్చుకుంటే ఇప్పుడు కూడా నా కాళ్లు వణుకుతాయి.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు ఆస్కార్ కు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే

Ram Charan: అది తల్చుకుంటే ఇప్పుడు కూడా నా కాళ్లు వణుకుతాయి.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక ఈ సినిమాలో బ్రిటీష్ పాలనలో పనిచేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రామ్ చరణ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందాడు. రామ్ చరణ్ ముంబై కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాడు. రామ్ లండన్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పట్టా పొందారు.
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 10, 2023 | 6:16 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఒకే ఒక్క సినిమా చరణ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు ఆస్కార్ కు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించి మెప్పించారు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ ఆస్కార్ కోసం అమెరికాలో ఉన్నారు. అక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.

కాగా తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు 7 రోజుల పాటు నాటు నాటు పాట‌ను రిహార్స‌ల్ చేశాం అన్నారు. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ కూడా యాక్టర్ కావడంతో  అక్క‌డ షూటింగ్ కు పరిమిషన్ ఇచ్చారు.

ఇక ఈసాంగ్ షూటింగ్ లో 150 మంది డాన్స‌ర్స్  పాల్గొన్నారు.అలాగే మరో200 మంది యూనిట్ స‌భ్యులున్నారు. మొత్తంగా ఆ పాటను మేము 17 రోజులు షూట్ చేశాం అన్నారు. అలాగే  డాన్స్ చేసే  టైంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం. నేనైతే 4 కిలోల బ‌రువు త‌గ్గిపోయాను. ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా నా కాళ్లు వ‌ణుకుతాయి అని తెలిపారు రామ్ చరణ్.