రెడ్ కలర్ శారీలో రెడ్ హాట్ గా మెరిసిన ఇస్మార్ట్ బ్యూటీ.. నభా ఇలా చూస్తే మతిపోవాల్సిందే

నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ నభానటేష్. ఆ తర్వాత ఈ చిన్నది డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో పాటు నభానటేష్ కు మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్  తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ సాలిడ్ సక్సెస్ […]

రెడ్ కలర్ శారీలో రెడ్ హాట్ గా మెరిసిన ఇస్మార్ట్ బ్యూటీ.. నభా ఇలా చూస్తే మతిపోవాల్సిందే
Nabha Natesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 10, 2023 | 7:36 AM

నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ నభానటేష్. ఆ తర్వాత ఈ చిన్నది డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో పాటు నభానటేష్ కు మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్  తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. చివరిగా ఈ భామ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో చేసింది.

అయితే సినిమాలతో దూరంగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది నభా. రకరకాల ఫొటోస్ షూట్స్ తో అభిమానులను అలరిస్తుంటుంది. ఇటీవలే ప్రమాదానికి గురయ్యానని చెప్పి షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న నభానటేష్.. మరోసారి తన ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. రెడ్ కలర్ శారీలో రెడ్ హాట్ గా మెరిసింది నభా. ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోలపై మీరూ ఒ లుక్కెయండి.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)