Jr NTR : ఎన్టీఆర్ సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అయ్యిందోచ్.. అది ఏ సినిమా అంటే..
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రీలీజ్ చేశారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ పోకిరి , ఒక్కడు, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తమ్ముడు, బాలయ్య చెన్నకేశవరెడ్డి, నాని అలా మొదలైంది లాంటి సినిమాలు
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లా హవా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రీలీజ్ చేశారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ పోకిరి , ఒక్కడు, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తమ్ముడు, బాలయ్య చెన్నకేశవరెడ్డి, నాని అలా మొదలైంది లాంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యంగ్ టైగర్ నటించిన సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఎన్టీఆర్ నటించి ఆంద్రావాలా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
2004 జనవరి 1వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈమూవీని రిలీజ్ చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే నెల వచ్చే వారంలో మరోసారి థియటర్లలోకి రాబోతుంది. తారక్ ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రక్షిత హీరోయిన్ గా చేసింది. చక్రి అందించిన సాంగ్ మాత్రం హిట్ గా నిలిచాయి. మరి ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. Andhrawala