Director Rajamouli: ఆ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సిఫార్సు..
ఓటు హక్కు వినియోగంపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించామని.. అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించినట్లు చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఇందుకు రాజమౌళి కూడా అంగీకరించినట్లు తెలిపారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంపు కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళిని జిల్లా ఎన్నికల ప్రచార కర్తగా నియమించారు. ఓట్ల శాతం పెరిగేలా ఓటర్లని చైతన్య పర్చేందుకు రాజమౌళి సేవలని వినియోగించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రచార కర్తగా రాజమౌళి పేరుని ఎన్నికల్ కమిషన్ కు కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించామని.. అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించినట్లు చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఇందుకు రాజమౌళి కూడా అంగీకరించినట్లు తెలిపారు.
రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులోనే రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతోపాటు.. వీడియో సందేశాల ద్వారా ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేయనున్నారు.
ప్రస్తుతం రాజమౌళి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా గత కొద్ది రోజులుగా జక్కనతోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ అమెరికా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.