AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. నేటి నుంచే పరుగులు.. ఛార్జీల వివరాలు ఇవిగో..

ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయనుంది. నవంబర్ 2 నుంచి సర్వీసులు మొదలయ్యాయి. బెంగళూరు నుంచి హుబ్లీ మీదుగా ముంబైకి దేశంలో మూడో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు టైమింగ్స్, ఛార్జీల వివరాలు ఖరారయ్యాయి.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. నేటి నుంచే పరుగులు.. ఛార్జీల వివరాలు ఇవిగో..
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Nov 02, 2026 | 9:35 AM

Share

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రం మీదుగా తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో వందే భారత్ రైళ్లు నడుస్తోండగా.. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు కూడా పరుగులు తీస్తోంది. అనేక చర్చల తర్వాత రాష్ట్రం మీదుగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు. ఆదివారం బెంగళూరులో ఈ రైలును రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రారంభించారు. బెంగళూరు-ముంబై మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టారు. బెంగళూరు నుంచి బయల్దేరి హుబ్లీ మీదుగా ముంబైకి జర్నీ కొనసాగించనుంది. ఇది మార్గం మధ్యలో మొత్తం 8 స్టేషన్లలో ఆగనుండగా.. ఏపీలో అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో స్టాపులు కల్పించారు. దీంతో ఏపీ ప్రజలకు కూడా వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

ఏపీలోని ఈ స్టేషన్లలో స్టాపులు..

బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలును ఆదివారం ప్రారంభించారు. సోమవారం నుంచి రెగ్యులర్ సర్వీసులు అందించనుంది. దేశంలో మూడో వందే భారత్ స్లీపర్ రైలుగా ఇది నిలిచింది. ఇది బెంగళూరును పుణె, ముంబైతో అనుసంధానం చేయనుంది. హుబ్లీ మీదుగా ప్రయాణించనున్న ఈ రైలు.. కర్ణాటకలోని అన్ని ప్రాంతాలను కలుపుతుంది. అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురిగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ స్టేషన్లలో ఆగనుంది. ఈ మార్గంలో మొత్తం రెండు వందే భారత్ స్లీపర్ సెట్లను నడపనున్నారు. ఈ రైల్లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. బెంగళూరు-ముంబై మధ్య సోమవారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులు అందించనుండగా.. ఇక ముంబై-బెంగళూరు రైలు మంగళవారం మినహా మిగతా 6 రోజుల్లో నడుస్తుంది. నిర్వహణ కోసం ఒక రోజు నిలిపివేయనున్నారు.

టైమ్ షెడ్యూల్ ఇదిగో..

నవంబర్ 1న ప్రారంభమవ్వగా.. నవంబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. ముంబై-బెంగళూరు(27651) వందే భారత్ స్లీపర్ రైలు రాత్రి 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గుంతకల్లు, 8.38 గంటలకు అనంతపురం, మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు-ముంబై(27652) రైలు బెంగళూరులో రాత్రి 7.45 గంటలకు బయల్దేరి అనంతపురంకు 10.28 గంటలకు, గుంతకల్లుకు 11.20 గంటలకు చేరుకుంటుంది. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణానికి 22 గంటలు పడుతుండగా.. ఈ రైలు ద్వారా 16 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైల్లో మొత్తం 16 ఏసీ బోగీలు ఉండగా.. 823 బెర్త్‌లు ఉంటాయి.

టికెట్ ఛార్జీలు ఇవే..

వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీల విషయానికొస్తే.. బెంగళూరు నుంచి ముంబైకు థర్డ్ ఏసీ (3AC) ఛార్జీ రూ.2,810, సెకండ్ ఏసీ (2AC) ఛార్జీ రూ.3,630, ఫస్ట్ ఏసీ ఛార్జీ రూ.4,450గా రైల్వేశాఖ నిర్ణయించింది.

Follow Us
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో