Sreeleela: సెట్స్‏లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్.. ‘NBK 108’ నుంచి అఫీషియల్ అనౌన్స్‏మెంట్..

షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Sreeleela: సెట్స్‏లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్.. 'NBK 108' నుంచి అఫీషియల్ అనౌన్స్‏మెంట్..
Sreeleela
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2023 | 6:58 AM

ఇటీవల వీరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, హానీ రోజ్ కథానాయికలుగా కనిపించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయకురాలిగా నటించారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా NBK 108 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతుంది. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభంకాగా.. కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లుగా ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గురువారం ఆమె సెట్‏లోకి అడుగుపెట్టింది. శ్రీలీలకు స్వాగతం పలుకుతూ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీలకు సాదరంగా ఆహ్వానం అంటూ మూవీటీమ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో శ్రీలీలకు బాలయ్య కూతురిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. కూతురి కోసం పోరాడే తండ్రిగా బాలయ్య కనిపించనున్నారని.. ఈ చిత్రం ఫుల్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.