Balakrishna: బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో లెజెండ్ ఒకటి. 2014లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ముఖ్యంగా బాలయ్య డైలాగులైతే అభిమానులకు పిచ్చెక్కించాయి. అయితే ఇదే లెజెండ్ సినిమాలో ఒక చిన్న పాప కూడా చాలా క్యూట్ గా కనిపించింది.

టాలీవుడ్ లో బాలకృష్ణ-బోయపాటి శీనులది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రానుంది. అదే అఖండ తాండవం. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అసలు విషయానికి వస్తే.. బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లెజెండ్. ఈ సినిమాలోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. లెజెండ్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది బాలయ్య యాక్షన్ సీన్స్ అలాగే ఆయన నోటి నుంచి వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్స్. వీటిని చూసిన నందమూరి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.
లెజెండ్ సినిమాలో భారీ తారగణమే ఉంది. జగపతి బాబు విలన్ గా నటించాడు. అలాగే కల్యాణి, సుమన్, సుహాసిని, బ్రహ్మానందం, జయ ప్రకాశ్ రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, కమల్ కామరాజు, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, చలపతి రావు, ఈశ్వరి రావు, సితార, సుదీపా పింకీ ,సమీర్.. ఇలా చాలా మంది నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించారు. వీరితో పాటు ఇదే సినిమాలో ఓ ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్యను ముద్దుగా మావయ్యా? అని పిలిచే చిన్నారి గుర్తుందా? సినిమాలో ఒకటి, రెండు సీన్లలో నటించిన ఆ పాప కూడా బాగా వైరలయ్యింది. ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ ఆ మావవయ్య డైలాగ్, ఆ పాప కనిపిస్తుంటాయి. మరి ఈ చిన్నారి ఎవరు? ఇప్పుడేం చేస్తుంది? అని నెటిజన్లు గాలిస్తున్నారు.
లెజెండ్ సినిమాలో నటించిన ఆ పాప మరెవరో కాదు డైరెక్టర్ బోయపాటి శీను కూతురు. ఆ చిన్నారు పేరు జోషిత శ్రీను. లెజెండ్ సినిమా చేసే సమయంలో జోషిత వయసు కేవలం 3 ఏళ్లు మాత్రమే. ఇక ఇప్పుడు ఆ పాప స్కూల్ కు వెళుతోంది. కాగా బోయపాటికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతురు జోషితతో పాటు కొడుకు కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో చిన్నప్పటి అల్లు అర్జున్‌లా నటించింది బోయపాటి కొడుకే.
బోయపాటి శీను ఫ్యామిలీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








