OTT Movie: భయపెట్టే హారర్ థ్రిల్లర్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎమ్ డీబీలోనూ 7.1/10 రేటింగ్
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ఒరిజినల్ ఇంగ్లిష్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. అయితే ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ 7.1/10 రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే బెటర్.

ఇప్పుడు ఎక్కడ చూసినా హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ఓటీటీలో అయితే ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం సరికొత్త హారర్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను డబ్ చేసి మరీ ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు మరో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విశేషమేమిటంటే.. ఈ సినిమా ఒరిజినల్ ఇంగ్లిష్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. అయితే తెలుగు ఆడియెన్స్ కోసం లేటెస్ట్ గా ఓటీటీలోకి తెలుగు వర్షన్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా సూపర్‌నేచురల్ హారర్, బాడీ హారర్, సైకాలజికల్ హారర్ అంశాలతో నిండి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ హారర్ చిత్రంగా కూడా ఎంపికైంది. గతంలో ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్ హారర్ మూవీ ‘టాక్ టు మి’ . దీనిని తెరకెక్కించిన దర్శకులు డానీ, మైఖేల్ ఫిలిప్పో మరో హారర్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టారు. అదే ‘బ్రింగ్ హర్ బ్యాక్’. ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది.
ప్రస్తుతం ‘బ్రింగ్ హర్ బ్యాక్’ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వర్షన్‌తో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. అయితే కేవలం రెంటల్ బేసిస్ లో మాత్రమే. అంే దీన్ని చూడటానికి రూ. 75 చెల్లించాలి. అంతేకాకుండా, తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. కాబట్టి నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు ఈ బ్రింగ్ హర్ బ్యాక్ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఐఎమ్ డీబీలో ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు 7.1/10 రేటింగ్ ఉండడం విశేషం.
నెట్ ఫ్లిక్స్ లో ‘బ్రింగ్ హర్ బ్యాక్’ తెలుగు వెర్షన్..
#BringHerBack [2025] Australian Horror Mystery Thriller Film Now Streaming On#NetflixIndia
In Tamil Telugu Hindi Language’s #MovOTTFun #newreleases #newmovies #OTTReleases pic.twitter.com/2UWpklEaCy
— MoviesOTTnFun (@MovOTTFun) November 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




