Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ వారసుల ఎంట్రీ.. ప్రూఫ్ ఇదిగో
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న స్పిరిట్ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం (నవంబర్ 23) పూజా కార్యక్రమాలతో ఈ పాన్ ఇండియా మూవీని షురూ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపారు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో స్పిరిట్ కూడా ఒకటి.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. . ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది. హీరో ప్రభాస్, హీరోయిన్ తృప్తి దిమ్రితో పాటు టీమ్ అంతా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు. కాగా కొన్ని రోజుల నుంచి స్పిరిట్ సినిమా గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మాస్ మహరాజా రవితేజ కొడుకు, డైరెక్టర్ త్రివిక్రమ్ కుమారుడు స్పిరిట్ సినిమాలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా? కాదా? అని నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడీ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
స్పిరిట్ సినిమా షూటింగ్ లాంచ్ ఫూర్తయిన తర్వాత అందరూ కలిసి సరదాగా ఒక ఫొటో దిగారు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కూడా సరదాగా ఒక ఫొటో తీసుకుంది. అందులో హీరో రవితేజ కొడుకు మహాధన్, దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు రిషి కూడా కనిపించారు. దీంతో కొన్నాళ్ల క్రితం నుంచి వస్తోన్న రూమర్లు నిజమేనని క్లారిటీ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వారసుడు తనలానే డైరెక్టర్ అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ.. హీరో రవితేజ కొడుకు మాత్రం దర్శకత్వం వైపు రావడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. వీరిద్దరూ స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేయనున్నారని సమాచారం.
స్పిరిట్ సినిమా లాంచింగ్ లో త్రివిక్రమ్, రవితేజ తనయులు..

Spirit Movie
స్పిరిట్ సినిమా లాంఛింగ్ ఫొటోస్..
India’s biggest superstar #Prabhas’s SPIRIT has been launched with Megastar @KChiruTweets garu as the special guest. 🙏🔥 #BhushanKumar @imvangasandeep.@tripti_dimri23 @VangaPranay @ShivChanana#OneBadHabit@vivekoberoi @prakashraaj #KrishanKumar @neerajkalyan_24… pic.twitter.com/Xmq6O4jfwk
— Bhadrakali Pictures (@VangaPictures) November 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








