AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ముంబైలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. రాత్రిళ్లు చూడొద్దు

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే.

OTT Movie: ముంబైలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. రాత్రిళ్లు చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 23, 2025 | 7:27 PM

Share

ఓటీటీలో ఈ మధ్యన రియల్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా రిలీజవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ముంబైలోని జుహు బీచ్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఆక్టటుకనే కథా కథనాలు, ఉక్కిరిబిక్కిరి చేసే ట్విస్టులు, సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇది ముంబైలో జరిగిన ఓ రియల్ స్టోరీ.. జుహు బీచ్ లో ఒక పాడుబడిన దెయ్యాల నౌకను తరలించే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. ఇందులో హీరో ఒక షిప్పింగ్ అధికారిగా ఉద్యోగం చేస్తుంటాడు. అయితే కొన్ని కారణాతో హీరో తన భార్య, కుమార్తెలను కోల్పోతాడు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. ఇదంతా జరుగుతుండగానే ముంబైలోని జుహు బీచ్‌లోకి ఓ పాడుబడిన ఓ కొట్టుకొస్తుంది. ఈ ఓడలో ఎవరూ ఉండరు.. కానీ అందులోకి వెళ్లిన వారెవ్వరూ ప్రాణాలతో తిరిగి రారు.

మిస్టరీ డెత్స్ గురించి తెలుసుకున్న హీరో తన స్నేహితులతో కలిసి ఓడలోని మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇదే క్రమంలో నౌకలో అతనికి భయానక పరిస్థితులు ఎదరువుతాయి. అదే సమయంలో నౌక గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి ఆ పాడుబడిన నౌకలో ఎవరున్నారు? మిస్టరీ డెత్స్ వెనక ఎవరున్నారు? హీరో ఈ ఓడ మిస్టరీని ఎలా కనుక్కొన్నాడు? చివరికి ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘భూత్ : ది హాంటెడ్ షిప్’. భాను ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌశల్ భూమి పెడ్నేకర్, ఆశుతోష్ రానా ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ‘భూత్ : ది హాంటెడ్ షిప్’. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హిందీ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో చాలా భయానక సన్నివేశాలున్నాయి. కాబట్టి చిన్న పిల్లలతో చూడకపోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..