Cinema: 40 కోట్లతో తీస్తే 340 కోట్లు.. ఆస్కార్ బరిలో బాక్సాఫీస్ సెన్సేషన్.. ఏ ఓటీటీలో ఉందంటే?
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 340 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు.. అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్సులు లేవు.. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా లేవు..పేరున్న దర్శకుడు కూడా కాదు. రిలీజ్ కు ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ చిత్రం 200 థియేటర్లలో పైగా 50 రోజులు ఆడింది. అంతేకాదు ఓవరాల్ గా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ తెచ్చుకుంది. ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలోనూ సంచలనం సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ నామినేషన్ల తుది దశకు ఎంపిక అవుతుందా లేదా అనేది జనవరి 22, 2026న తెలుస్తుంది.
ఇంతకీ ఆస్కార్ బరిలో నిలిచిన ఆ సినిమా ఏదనుకుంటున్నారా? వరల్డ్ బిగ్గెస్ట్ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా. ఈ చిత్రం ఆస్కార్-2026 బరిలో నిలిచింది. యానిమేటెడ్ విభాగంలో అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యింది. ‘మహావతార నరసింహ’ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. ‘మహావతార నరసింహ’ సినిమా నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవత పురాణం ఆధారంగా అశ్విన్ కుమార్ ఈ యానిమేటెడ్ మూవీని తెరకెక్కించారు.
2026 ఆస్కార్‌లకు నామినేషన్ల చివరి దశకు ఎంపిక కావడానికి 35 యానిమేటెడ్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ‘మహావతార నరసింహ’ చిత్రం నామినేట్ అయితే, భారతదేశం నుండి ఆస్కార్‌కు నామినేట్ అయిన మొదటి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా ఇది నిలుస్తుంది. ఈ కారణంగా ఇప్పుడు అందరి దృష్టి ఆస్కార్ నామినేషన్ల చివరి దశపై ఉంది. 98వ అకాడమీ అవార్డులకు నామినేషన్ జాబితా జనవరి 22, 2026న ప్రకటించనున్నారు. అవార్డు ప్రదానోత్సవం మార్చి 15, 2026న జరుగుతుంది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ఇప్పటికే భారతదేశం నుండి ఆస్కార్ పోటీకి ఎంపికైంది. ఈ హిందీ భాషా చిత్రం ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ విభాగానికి భారతదేశం నుండి అధికారికంగా ఎంపికైంది.
మరికొన్ని రోజుల్లో తుది నిర్ణయం
#MahavatarNarsimha Now Eligible for Consideration in the Animated Feature Film Category at the 98th Academy awards 🔥👌 pic.twitter.com/83yFnDVtRL
— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) November 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








