OTT Movie: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. కడుపుబ్బా నవ్వించే విలేజ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

మసూద ఫేమ్ తిరువీర్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించింది. నవంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ఆకట్టుకునే కథ కథనాలు, విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడం, కామెడీకి పెద్ద పీట వేయడంతో ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. నిర్మాతలకు కూడా మంచి లాభాలనే తెచ్చి పెట్టింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వీరి నిరీక్షణకు తెరపడనుంది. ఈ ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసకుంది. ఈ నేపథ్యంలో తిరువీర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబరు 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ చూస్తున్నంత సేపు ఎలాంటి బోర్ కొట్టదు. ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? అన్న చిన్న పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. కామెడీ, ఎమోషన్స్ జోడించి తెరకెక్కించిన ఈ సినిమా అంతా పల్లెటూరులో సాగుతుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలోకి వచ్చాక తప్పక చూడండి.
జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్..
The Great Pre-wedding Show locks its OTT date 🎬✨
Thiruveer’s The Great Pre-wedding Show arrives on ZEE5 on December 5. After a solid theatrical run and $100K overseas, the early OTT deal has already put the film in a profitable space.
With its chaotic village humour, missing… pic.twitter.com/jl4eyILPG7
— IndiaOnScreen (@IndiaOnScreen) November 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








