- Telugu News Photo Gallery Cinema photos Actor Thiruveer Latest hit Movie The Great Pre Wedding Show OTT Streaming Date Fixed
OTT Movie : థియేటర్లలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోకి కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
ఈమధ్య కాలంలో చాలా సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి. ఇటీవల థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఇంతకీ ఎప్పుడు ? ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుంటామా.
Updated on: Nov 22, 2025 | 1:10 PM

తెలుగు సినిమా ప్రపంచంలో చాలా చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి. ఇందులో యంగ్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించారు.

ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా.. హడావిడి లేకుండా నవంబర్ 7న అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతోపాటు మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈసినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ కావడంతో.. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5 నుంచి ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

థియేటర్లలో దాదాపు నాలుగు వారాలపాటు మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ తెగ నడుస్తుంది.

పెళ్లి ఫోటోస్, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోస్ మిస్ కావడం చాలా సహజం. ఈ అంశానికే కామెడీ, ఎమోషన్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కథ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అడియన్స్ ముందుకు వస్తుంది.




