AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: 50 లక్షలతో తీస్తే ఏకంగా 70 కోట్లు.. బాక్సాఫీస్ సెన్సేషన్ గా చిన్న సినిమా.. ఇంతకీ ఏముందీ మూవీలో

కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటివరకు 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్ల హీరో చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఏముందీ సినిమాలో..

Cinema: 50 లక్షలతో తీస్తే ఏకంగా 70 కోట్లు.. బాక్సాఫీస్ సెన్సేషన్ గా చిన్న సినిమా.. ఇంతకీ ఏముందీ మూవీలో
Laalo Krishna Sada Sahaayate Movie
Basha Shek
|

Updated on: Nov 22, 2025 | 8:18 AM

Share

స్టార్ హీరోలు, హీరోయిన్లు, పెద్ద డైరెక్టర్లు, యాక్షన్ సీక్వెన్సులు, స్పెషల్ సాంగ్స్ లు, వీఎఫ్ఎక్స్ హంగులు.. ప్రస్తుతం ఓ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వాలంటే పైన చెప్పినవన్నీ ఉండాల్సిందే. అయితే ఇవేవీ లేకున్నా కేవలం కంటెంట్ తోనే హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. ఈ మధ్యన వచ్చిన కోర్ట్, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలు ఇందుకు మంచి ఉదాహరణలు. ఇప్పుడు ఒక గుజరాతీ సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా పేరు ‘లాలో కృష్ణ సదా సహాయతే’. గుజరాతీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ చిన్న సినిమా ఇప్పుడు వివిధ భాషల్లోకి కూడా రిలీAdd Newజ్ అవుతోంది. ముందుగా హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. నవంబర్ 28న లాలో కృష్ణ సదా సహాయతే హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. ఆద్యంతం ఎమోషనల్ గా సాగే ఈ మైథాలజీ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.

ఈ సినిమా అక్టోబర్ 10, 2025న థియేటర్లలో గుజరాతీలో విడుదలైంది. మొదట పెద్దగా వసూళ్లు రాలేదు. కానీ మౌత్ టాక్ తో నెమ్మదిగా ఈ సినిమా కలెక్షన్లు పెరిగాయి. మూడవ వారం నుండి ఈ మూవీ కలెక్షన్లు హోరందకున్నాయి. చివరకు, నాల్గవ వారం నాటికి, ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం ప్రారంభించారు. ఒకే రోజులో రూ. 5 కోట్ల బిజినెస్ చేసిన మొదటి గుజరాతీ సినిమా ఇదే. ఇప్పటివరకు ఈ సినిమా రూ.71 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే దీని వసూళ్లు రూ.100 కోట్ల మార్కును చేరుకుంటాయి. ఏ గుజరాతీ సినిమాకైనా ఇది అద్భుతమైన విజయం. ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.50 లక్షలు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి అంకిత్ సాకియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయంలో నటీనటుల సహకారం కూడా గొప్పది. ఇందులో రీవా రాచ్, శ్రుహాద్ గోస్వామి, కరణ్ జోషి, అన్షు జోషి, కిన్నల్ నాయక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు డబ్బింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత, ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొంది, థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..