Bigg Boss 9 Telugu : బయటసరిపోక బిగ్‌బాస్‌కి వచ్చావ్.. కొట్టుకున్నంత పనిచేసిన దివ్య, తనూజ.. సైలెంట్‌గా జారుకున్న భరణి..
దివ్య వర్సెస్ తనూజ.. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరి మధ్యలో మొదటి నుంచి ఇబ్బందిపడుతున్న వ్యక్తి భరణి. అయితే కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. తనూజ, దివ్య ఇద్దరు పర్సనల్ అటాక్ చేసుకున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 9.. మొత్తం పదకొండు వారాల్లో ఇంత పెద్ద రచ్చ జరగడం ఇదే తొలిసారి. దివ్య, తనూజ ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా ఇమ్మాన్యుయేల్ తల్లి.. ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేశారు. ఇక తర్వాత మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించండి అంటూ చెప్పాడు బిగ్‌బాస్ . ముందుగా దివ్య లేచి తన అభిప్రాయం చెబుతూ తనూజను తొలగిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే టూ వీక్స్ వరుసగా ఇమ్మూనిటీ వచ్చింది.. ప్లస్ నువ్వు ఆల్రెడీ 12వ వారం వరకు ఉంటావ్.. ఇంకా కెప్టెన్ చేస్తే పదమూడవ వారం వరకు ఉంటావ్.. సో ఆ పాయింట్ లో నిన్ను నేను ఈ రేసు నుంచి తొలగిద్దాం అనుకుంటున్నాను అని దివ్య చెప్పడంతో.. ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు అంటూ గొడవ స్టార్ట్ చేసింది తనూజ.
ఇమ్యూనిటీ అంటూ క్లారిటీ ఇవ్వడానికి దివ్య ట్రై చేసినప్పటికీ తనూజ మాత్రం గొడవను మాత్రం సాగదీస్తూనే ఉంది. ప్రతిదానికి నన్ను లాగకు.. నా విషయంలోకి రాకు అంటూ తనూజ అరిచింది. కెప్టెన్సీ వీక్ లో ఎవరున్నా ఇలాగే చేసేదాన్ని అంటూ దివ్య చెప్పింది. కావాల్సినవన్నీ పోట్రే చేయకు తనూజ అంటూ దివ్య చెప్పింది. కావాల్సినవి కాదు నీ బిహేవియర్ బట్టే నేను చెప్తున్నాను అంటూ తనూజ చెప్పింది. నువ్వు అరవకు.. నేను అరుస్తా అంటూ తనూజ అనడంతో.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఉంటూ దివ్య అరవడంతో మైండ్ యూవర్ వర్డ్స్ అని తనూజ అంది. ప్రతిదీ పోట్రే చేయడానికే ఉంటావ్ అంటూ కౌంటరిచ్చింది దివ్య.
హే పో అని తనూజ అనడంతో.. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో.. నీలాగ చెత్త స్టోరీలు అల్లి పోట్రే చేయట్లేదు బయట సింపతీ కోసం అంటూ దివ్య ఫైర్ అయ్యింది. నీలా ఫేక్ గా ఉండడం నాకు రాదు.. ఇది నీ ఒరిజినాలిటీ.. మనిషిని బట్టే ఉంటది నా ఆటిట్యూడ్.. నేను చెప్పి తీసేస్తాను. నువ్వు నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అంటూ దివ్య ఇచ్చిపడేసింది. ఇక తర్వాత సంజన వచ్చి తనూజ పేరు చెప్పడంతో మళ్లీ మొదలుపెట్టింది తనూజ. దీంతో మరోసారి గొడవ కంటిన్యూ అయ్యింది. నీ ఒరిజినాలిటీ బయటపడింది అంటూ దివ్య ఫైర్ అయ్యింది. ఎవరో ఒకరు పర్సనల్‌ది తీసుకొచ్చేసి ప్రతి దానిలో నా పేరు లాక్కొచ్చి ప్రతి దానిలో నాపైన ఏడుస్తున్నారు.. అంటూ తనూజ మరోసారి నోరు జారింది. దీంతో ఏయ్ ఏడుస్తున్నారు అనకు అంటూ తనూజ అని చెప్పడంతో.. దివ్య సీరియస్ అయ్యింది.
దివ్య, తనూజ పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశారు. ఆ మనిషితో నేను మాట్లాడితే న్యూస్ క్రియేట్ చేయాలని చూస్తుంది అంటూ తనూజ మాట్లాడుతూనే ఉంది. నువ్వు సీరియల్ స్టార్.. అక్కడ ఏడ్చినట్లే.. ఇక్కడు కూడా ఏడు అంటూ దివ్య పర్సనల్ అటాక్ చేసింది. నువ్వు రివ్యూ ఇవ్వు.. బయట సరిపోక ఇక్కడికొచ్చావ్ అంటూ తనూజ చెప్పడంతో.. నీలాగ అందరినీ గేమ్ కోసం వాడుకోను అంటూ గట్టిగానే పంచ్ ఇచ్చింది దివ్య. ఒక మనిషి ఇష్టం లేదని బిహేవియర్ లో చూపిస్తున్నా నీలాగ వెంటపడట్లేదు అంటూ తనూజ నోరు జారింది. దీంతో దివ్య మరింత రెచ్చిపోయింది. భరణి గారు ఇటు రండి అని దివ్య పిలవడంతో.. ఏయ్ అంటూ పిలిచింది అంటూ మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది తనూజ. దీంతో ఏయ్ అనలేదు..భరణి గారు అని పిలిచింది అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు భరణి. మీ ఇద్దరు మాట్లాడుకోండి నన్ను మధ్యలోకి లాగకండి అంటూ సైలెంట్ గా జారుకున్నాడు భరణి. తర్వాత దివ్య, తనూజ ఇద్దరు కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో హౌస్మేట్స్ ఇద్దరిని దూరంగా లాక్కుపోయారు. అయితే గొడవ ఆపేసి.. దివ్య సైలెంట్ అయినప్పటికీ.. తనూజ మాత్రం సాగదీస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..




