AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir-Alia: కపూర్ ఫ్యామిలీ డిన్నర్‌లో కనిపించని ఆలియా… విడాకుల బాటలో స్టార్ కపుల్?

బాలీవుడ్‌లో 'కపూర్' అంటే ఒక డైనస్టీ, ఒక ఫ్యామిలీ ట్రెడిషన్. ప్రతి జనరేషన్‌కు కొత్త హీరోలు, హీరోయిన్లు… కానీ, ఇటీవల నెట్‌ఫ్లిక్స్ షో 'డైనింగ్ విత్ ది కపూర్స్' ప్రోమో వచ్చిన వెంటనే ఒక ప్రశ్న నెట్టింట చక్కర్లు కొడుతోంది. రణ్‌బీర్ కపూర్ ..

Ranbir-Alia: కపూర్ ఫ్యామిలీ డిన్నర్‌లో కనిపించని ఆలియా... విడాకుల బాటలో స్టార్ కపుల్?
Ranbir Alia
Nikhil
|

Updated on: Nov 23, 2025 | 12:23 AM

Share

బాలీవుడ్‌లో ‘కపూర్’ అంటే ఒక డైనస్టీ, ఒక ఫ్యామిలీ ట్రెడిషన్. ప్రతి జనరేషన్‌కు కొత్త హీరోలు, హీరోయిన్లు… కానీ, ఇటీవల నెట్‌ఫ్లిక్స్ షో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ ప్రోమో వచ్చిన వెంటనే ఒక ప్రశ్న నెట్టింట చక్కర్లు కొడుతోంది. రణ్‌బీర్ కపూర్ భార్య ఆలియా భట్ ఎక్కడ? కపూర్ ఫ్యామిలీ అందరూ కలిసి కుకింగ్, డైనింగ్, ఫన్ చర్చలు చేస్తుంటే… ఆలియా మాత్రం ఎందుకు కనిపించడం లేదు? అంటూ నెట్టింట చర్చ మొదలైంది.

‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అనేది ఆర్మాన్ జైన్ హోస్ట్ చేసే స్పెషల్ షో. ఇందులో కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కుక్ చేసి, డిన్నర్ తింటూ, పర్సనల్ స్టోరీలు షేర్ చేసుకున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో రణధీర్ కపూర్, రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, నీతూ కపూర్ (రణ్‌బీర్ మదర్), సైఫ్ అలీ ఖాన్ అందరూ కనిపించారు. అందరూ లాఫింగ్, కుకింగ్ చేస్తూ సరదాగా గడిపారు. కానీ, రణ్‌బీర్ పక్కన ఆలియా లేదు. ఆలియా భట్ మాత్రమే ఈ ఫ్యామిలీ గాదరింగ్‌లో అదృశ్యమైంది!

ఈ అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఆలియా, రణ్‌బీర్ మధ్య డిస్టెన్స్ పెరిగిందా? విడాకులు తీసుకుంటున్నారా?’ అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఆలియా, రణ్‌బీర్ 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో రొమాన్స్ చేసి, రియల్ లైఫ్‌లో కపుల్ అయ్యారు. 2024 మార్చిలో వాళ్లకి కూతురు రాహా పుట్టింది. కానీ, ఇటీవల రణ్‌బీర్ ‘అనిమల్’ సక్సెస్ తర్వాత ‘రామాయణ్​’లో రాముడి పాత్ర పోషిస్తున్నాడు. ఆలియా ‘జీజా’ (మీరా భట్ బైయోపిక్), ‘అల్పా బాయ్’ వంటి ప్రాజెక్టులతో సూపర్ బిజీగా ఉంది.



అయితే ఈ కపూర్​ ఫ్యామిలీ గ్యాదరింగ్​లో ఆలియా కనిపించకపోవడంపై హోస్ట్ ఆర్మాన్ జైన్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఆలియా, రణ్​బీర్​కి ఎలాంటి భేదాభిప్రాయం ఏమీ లేదు. ఆమె సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. ఫ్యామిలీ మీడియా డిన్నర్‌లో పాల్గొనలేకపోయింది. అంతే!’ అని చెప్పాడు. దీంతో రణ్​బీర్​-ఆలియా విడాకుల రూమర్స్​కి చెక్​ పడింది.