AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులకు మరో ఛాలెంజ్.. పైరసీ వెబ్సైట్ నిర్వాహకులు ఈసారి ఏం చేశారంటే

దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్‌ విసిరి, ఊచలు లెక్కిస్తున్నాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాలేజీ డేస్‌ నుంచి పెళ్లి వరకు తనకు జరిగిన అవమానాలతో డబ్బు సంపాదనే లక్ష్యంగా అడుగేశాడు.

పోలీసులకు మరో ఛాలెంజ్..  పైరసీ వెబ్సైట్ నిర్వాహకులు ఈసారి ఏం చేశారంటే
Piracy Websites
Lakshmi Praneetha Perugu
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 23, 2025 | 10:52 AM

Share

ఒకవైపు ఐ బొమ్మ రవి ను పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అతడు మెయింటైన్ చేసిన సర్వర్లు డేటాబేస్ మొత్తాన్ని ట్రాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. పైరసీపై ఈ స్థాయిలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే కొన్ని పైరసీ వెబ్సైట్లు మాత్రం యదేచ్ఛగా కొత్త సినిమాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. Movierulz వెబ్సైట్లో గత శుక్రవారం రిలీజ్ అయిన మూడు సినిమాలు ఒక్క రోజులోనే థియేటర్ ప్రింట్ తో వెబ్సైట్లో అప్లోడ్ చేసేసారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి కేవలం రెండు రోజులు కూడా కాలేదు. అసలు వెబ్సైట్ నిర్వహకులు అదేపనిగా పోలీసులకు చాలెంజ్ విసురుతూ ఇలాంటి కొత్త సినిమాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు.

పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వెబ్సైటు నిర్వాహకుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే ఐ బొమ్మ వెబ్సైట్ మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేసినప్పటికీ ఇతర మార్గాల్లో వాటి లింకులను పెడుతూ పైరసీ నిర్వాహకులు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాల ప్రింట్లను గంటల వ్యవధిలోనే తమ వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా లింకును క్లిక్ చేస్తే కొన్నిసార్లు థర్డ్ పార్టీ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కోరుతున్నాయి. దీంతో యూజర్ల డేటా చోరీ అయ్యే ఆస్కారం ఉందని ఇప్పటికే పోలీసులు హెచ్చరించిన చాలామంది వీక్షకులు వాటిని పట్టించుకోకుండానే పైరసీ వెబ్సైట్లో కొత్త సినిమాలను చూస్తున్నారు.

మరోవైపు ఐ బొమ్మ రవి అరెస్టు తరువాత అతడికి ఏ స్థాయిలో మద్దతు పెరిగిందో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ప్రజల మద్దతు కూడా ఉండటంతో ఇలాంటి వెబ్సైటు నిర్వాహకులకు అడ్డుకట్ట లేకుండా పోయింది. మరోవైపు సినిమా యూనిట్ సభ్యులు మాత్రం కోట్లు కష్టపడి సినిమా తీస్తే గంటల వ్యవధిలో సినిమా ప్రింట్ ను ఇలా వెబ్సైట్లో పెట్టేస్తున్నారని లబోదిబోమంటున్నారు. కొత్త సినిమాలను అందులోనూ చిన్న సినిమాలను థియేటర్ కి వెళ్లి చూస్తేనే ఆ సినిమా యూనిట్కు కాస్త డబ్బులు వస్తాయి. కానీ వెబ్సైటు నిర్వాహకుల వైఖరి లో ఇప్పటికీ మార్పు కనిపించడం లేదు. మరి పోలీసులు దీనిమీద ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి