AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే పడిపోయా.. మనసులో మాట బయటపెట్టిన నాగ చైతన్య

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య

ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే పడిపోయా.. మనసులో మాట బయటపెట్టిన నాగ చైతన్య
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2025 | 9:41 AM

Share

అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్, సినీ సెలబ్రెటీలు నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. హీరోగా తనను తాను మెరుగుపరుచుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు నాగ చైతన్య. తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకడు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. చివరిగా తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్  అందుకున్నాడు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చైతూ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దీంతో ఇప్పుడు చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన చైతూ.. ఇప్పుడు పీరియాడికల్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. చైతూ గతంలో తన ఫస్ట్ ఎవరనే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో సైతం చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భవిష్యత్తులో హిందీలో ఎవరితో పనిచేయాలని ఉందని యాంకర్ ప్రశ్నించగా.. చైతూ స్పందిస్తూ.. తన ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ అని.. ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు సైతం చెప్పానని అన్నారు. అలాగే అలియా భట్ యాక్టింగ్ అంటే ఇష్టమని.. ఆమెతో సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని అన్నాడు.

అలాగే ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ హీరోయిన్లతో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఆటోబయోగ్రఫీ రాయాల్సి వస్తే.. దానికి ఏం టైటిల్ పెడతారు అని అడగ్గా..”జీవితాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దు” అనే టైటిల్ పెడతానని.. ఏదైనా ఐలాండ్ లో చిక్కుకుపోతే తనకు ఇష్టమైన మ్యూజిక్ ఉండాలనుకుంటానని.. అలాగే తన మనసుకు నచ్చిన మహిళతో సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోతానని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.

నాగ చైతన్య ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?