- Telugu News Photo Gallery Cinema photos Actress Soniya Singh Visita Temples With His Boyfriend Pavan Sidhu, See Photos
ఆమె శివమాలలో.. అతను అయ్యప్పమాలలో.. పుణ్య క్షేత్రాలను చుట్టేస్తోన్న ప్రేమ పక్షులు.. ఫొటోస్ వైరల్
ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీషోల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోన్న సోనియా సింగ్ కు భక్తి భావం ఎక్కువే. అందుకే తరచూ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంటుందీ అందాల తార. ఇప్పుడు శివమాలను ధరించిన సోనియా మరోసారి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టింది. అయ్యప్ప మాల ధరించిన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రముఖ దేవాలయాను చుట్టేస్తోంది.
Updated on: Nov 23, 2025 | 5:10 PM

ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు కొనసాగుతున్నాయి. సామాన్యులతో పలువురు సినీ ప్రముఖులు అయ్యప్ప దీక్షలను స్వీకరించి శబరిమలకు యాత్రకు వెళుతున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లవ్ బర్డ్స్ సోనియా సింగ్- పవన్ సిద్దూలు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారు.

నటి సోనియా సింగ్ ప్రస్తుతం శివమాలలో ఉండగా, ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్దూ పవన్ అయ్యప్ప మాలను స్వీకరించారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తున్నారు.

తమ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ లవ్ బర్డ్స్. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

కాగా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సోనియా సింగ్ సాయి దుర్గ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక నితిన్, శ్రీలీల ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లోనూ ఓ కామెడీ రోల్ తో ఆకట్టకుందీ అందాల తార.

శశి మథనం అనే ఓటీటీ సినిమాలోనూ మెరిసిన సోనియా సింగ్ పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తుంటుంది.




