Raju weds Rambai: చిన్న సినిమాకు ఊహించని కలెక్షన్లు.. ‘రాజు వెడ్స్ రాంబాయి’కి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
చిన్న సినిమా ట్యాగ్ తో విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి'కి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ ప్రేమకథ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి.

హీరోలు, హీరోయిన్లు కొత్తవాళ్లే.. డైరెక్టర్ కూడా కొత్తవాడే.. అయితేనేం స్టార్ హీరోల సినిమాలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది రాజు వెడ్స్ రాంబాయి సినిమా. తద్వరా మరోసారి కంటెంటే కింగ్ అని నిరూపిస్తోంది. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యువత ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. మొదటి రోజే ఈ సినిమాకు దాదాపు కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ కలిసి రావడంతో ఇప్పటివరకు అంటే మూడు రోజుల్లో ఈ మూవీకి సుమారు రూ.7.28 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ అక్కడి నుంచే రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తుండడం విశేషం. మౌత్ టాక్ బలంగా ఉండడం, సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై చర్చ జరుగుతుండడం రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు అనుకూలంగా మారింది. అందుకే చాలా చోట్ల ఈ సినిమాకు థియేటర్లను పెంచుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రేమకథా చిత్రం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
ఇక సోమవారం కూడా ఈ సినిమాకు సాలీడ్ బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగో రోజు సాయంత్రం 5 గంటల వరకు రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాలుగో రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయలు రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంటే కేవలం నాలుగు రోజుల్లో రాజు వెడ్స్ రాంబాయి చిత్రం 10 కోట్ల మార్క్ అందుకుందన్నమాట.
సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే సిద్దూ జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ విలన్ పాత్రలో అదరగొట్టాడు. వీరితో పాటు శివాజీ రాజా, అనితా చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
థియేటర్లలో రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందం..
Raju, Rambai and Venkanna embracing all the love from the audience ❤️
Blockbuster response to #RajuWedsRambai theatre visit to Mythri Shiva Theatre, Karimnagar 💥💥
Book Your Tickets Now for Rural Cult Blockbuster 🎟️ https://t.co/8Yb3vzr6vX pic.twitter.com/DKIzqvcBxC
— Bunny Vas (@TheBunnyVas) November 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








