మహేష్ రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు.. ఏ మూవీనో తెలుసా?
పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న ఈ హీరోల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాక్ తో సంబంధం లేకుండా ఈ హీరోల సినిమాలకు కలెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ లో ఈ హీరోలకు చాలా మంచి గుర్తింపు ఉంది.

సినిమా కథల ఎంపికలో ఒక్కో హీరోకు ఒక్కో క్యాలిక్యులేషన్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పిన కథ తనకు సూటవుతుందా? అభిమానులకు నచ్చుతుందా? కామన్ ఆడియెన్స్ చూస్తారా? .. ఇలా ఒక సినిమా ఎంపికలో చాలా అంశాలు పరిగణణలోకి వస్తాయి. వివిధ సమీకరణాలను బేరీజు వేసుకుని కొన్నిసార్లు తమ దగ్గరకు వచ్చిన మంచి సినిమా కథలను కూడా రిజెక్ట్ చేస్తారు. దీంతో ఆ సినిమా కథలు వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతాయి. అలా చేతుల మారిన సినిమా కథలు ఒక్కోసారి హిట్ అవ్వొచ్చు.. మరోసారి ఫ్లాఫ్ అవ్వొచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కల్యాణ్, మహేష్ బాబుల విషయంలో కూడా ఇది జరిగింది. అవును.. మహేష్ బాబు వద్దన్న కథతో పవన్ కల్యాణ్ సినిమా చేశాడు.. కట్ చేస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు పవన్ కు స్టార్ హీరో ఇమేజ్ ను మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా యూత్ లో పవన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసింది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే కల్ట్ క్టాసిక్ గా ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. రీ రిలీజ్ లోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక టీవీలో ఎప్పుడు వచ్చినా ఈ సినిమాను అసలు వదిలిపెట్టరు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? ఖుషి
ఈ సినిమాకు నటుడు ఎస్జే సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక హీరోయిన్ గా నటించింది. 2001లో రిలీజైన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమాకు హీరోగా పవన్ కల్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట ఈ సినిమా స్టోరీని ఎస్ జె సూర్య మహేష్ బాబు తో చేయాలని అనుకున్నారట.అయితే అప్పటికే మహేష్ చేతిలో పలు సినిమాలు ఉండడం, ఇతర కారణాలతో ఖుషి సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఇదే కథను పవన్ కల్యాణ్ తో తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎస్‌జే సూర్య.
కాగా ఖుషి సినిమా తర్వాత ఎస్జే సూర్యకు మరో మంచి ఆఫర్ ఇచ్చాడు మహేష్ బాబు. వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాని. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఎస్ జే సూర్య క్రమంగా డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులు వేశాడు.
రాజమౌళితో మహేష్ బాబు..
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








